33.7 C
Hyderabad
April 29, 2024 01: 12 AM
Slider విజయనగరం

పండగలన్నీ క‌రోనా నిబంధనలతో జరుపుకోండి…వినాయ‌క చ‌వితి కూడా క‌ష్ట‌మే

#suryakumariias

విజ‌య‌న‌గ‌రం  జిల్లాలో క‌రోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా  సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రూ క‌రోనా నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌ని స‌రిగా పాటించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ సూచించారు.

అందునా రాబోయే నెల‌లో అంటే సెప్టంబ‌ర్ 12 న వ‌స్తున్న వినాయ‌క చ‌వితిని కూడా కరోనా నియ‌మ‌నిబంధ‌న‌ల‌తో ఎవ‌రి ఇంట్లో వారే జ‌రుపుకోవాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.  జిల్లా లో కొన్ని చోట్ల కంటైన్ మెంట్ జోన్లు గా ప్రకటించడం దురదృష్ట కరమని అని అన్నారు…జిల్లా కలెక్ట‌ర్ సూర్య‌కుమారీ. ప్ర‌త్యేకించి ఎస్.కోట ను కంటైన్మెంట్ జోన్ గా ప్ర‌క‌టించ‌డం జ‌రిగింద‌న్నారు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు రోజుకు 30 కేసులు న‌మోదు కాగా…తాజాగా రోజుకు 50 కేసులు న‌మోదు అవుతుండ‌టం దుర‌దృష్ట‌క‌రమ‌న్నారు.రోజు రోజుకు కోవిడ్ కేస్ లు పెరుతున్నాయని ప్రతి ఒక్కరు గమనించాలని క‌లెక్ట‌ర్ కోరారు.ఈ మేర‌కు  క‌లెక్ట‌ర్ మీడియా తో మాట్లాడుతూ….. పాఠశాలలు కూడా తెరుచుకున్నందున పిల్లల భవితవ్యాన్ని దృష్టి లో పెటుకొని ప్రతి ఒక్కరు వాక్సిన్ వేయించుకోవాలని అన్నారు.

18 ఏళ్ళు నిండిన వారికి వాక్సిన్ వేయడం జరుగుతోందని అన్నారు. క‌రోనా దృష్ట్యా  రాబోయే పండగ లన్నిటిని క‌రోనా తగ్గే వరకు   నిబంధనల ననుసరించి జరుపుకోవాలని  తెలిపారు.  పండగల్లో వ్యక్తుల మధ్య కనీసం  6 అడుగుల  సోష‌ల్ డిస్ట‌న్స్ పాటించాలని,   ప్రతి ఒక్కరు మాస్క్ వినియోగించాలని, శానిటైజర్  వాడాలని సూచించారు.  

రోజు రోజుకు క‌రోనా కేసు లు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని క‌రోనా నియంత్రణ కు  ప్రజలంతా సహకరించాలని  విజ్ఞప్తి చేసారు.

Related posts

విజయోత్సవ ర్యాలీ కి తరలి వెళ్ళిన బీజేపీ కార్పొరేటర్లు

Satyam NEWS

సూర్యాపేట బిజెపిలో కొత్త నేతల సందడి

Satyam NEWS

సివిల్స్ లో 211 ర్యాంకు సాధించిన నందలూరు విద్యార్థిని

Satyam NEWS

Leave a Comment