24.7 C
Hyderabad
March 26, 2025 10: 50 AM
Slider వరంగల్

అభయాంజనేయ ఆలయనిర్మాణానికి ప్రతిష్టాపన

#temple

అభయాంజనేయ గణపతి సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహ ఆలయ నిర్మాణ ప్రతిష్ట కార్యక్రమం మదనపల్లి వాస్తవ్యుడు అడ్వకేట్ భూక్య హోమ్ సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ములుగు మండలం  జంగాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్ గ్రామంలో ఈనెల 14 నుండి 16 వరకు అంగరంగ వైభవంగా ఆలయ నిర్మాణ, ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు.

శ్రీ శ్రీ పర్స సాయి ప్రదీప్ దివ్య కరములచే ఆలయ విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. మూడు రోజులపాటు రాంనగర్ గ్రామంలో వేద మంత్రచ్చరణల నడుమ మారుమొగింది. మూడు రోజులపాటు గ్రామంలోని ప్రజలు భక్తి శ్రద్ధలతో శ్రీ అభయాంజనేయ స్వామి గణపతి సుబ్రహ్మణ్య నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ పూజ కార్యక్రమంలో ములుగు శాసనసభ్యురాలు సీతక్క, సీఐ మేకల రంజిత్ కుమార్, తోపాటు ఆలయ నిర్మాణ దాతలు భూక్య లావణ్య హోమ్ సింగ్,  విుసరకాండ్ల విజయ శీను, కార్యవర్గ సభ్యులు ధరంసోత్ బాబురావు,  శానం సాంబయ్య, శానం సంతోష్, కిరణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉత్తరప్రదేశ్ ఘటనపై సుప్రీం లో పిల్ దాఖలు

Satyam NEWS

చదువురాని దానవు, నువ్వేం సర్పంచ్ వి పక్కకు జరుగు

Satyam NEWS

నిషేధిత గంజాయి,గుట్కా కోసం కిరాణం షాపుల్లో ముమ్మర తనిఖీలు

Satyam NEWS

Leave a Comment