38.2 C
Hyderabad
May 2, 2024 21: 48 PM
Slider గుంటూరు

రాజశేఖర రెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

#ysrstatue

మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. గుంటూరు జిల్లా జొన్నలగడ్డ, రంగారెడ్డి పాలెం వెళ్లే దారిలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కొద్ది రోజుల కిందట ఎవరో అపహరించారు. దాంతో విగ్రహం అపహరణకు గురైన ప్రదేశంలోనే నిలువెత్తు వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నరసరావుపేట శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిర్ణయించారు.

నరసరావుపేట పట్టణంలోని 60 అడుగుల రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మల్లమ్మ సెంటర్, గుంటూరు రోడ్డు మీదగా జొన్నలగడ్డ చేరుకునే సరికి వేల మంది పార్టీ శ్రేణులతో  తిరుణాళ్ల వాతావరణాన్ని తలపించింది. భూమిపూజ కు ముఖ్య అతిథిలుగా ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మానాయుడు, గురజాల శాసనసభ్యులు కాసు మహేశ్ రెడ్డి, వేమూరు శాసనసభ్యులు మేరుగు నాగార్జున హాజరయ్యారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి శాసససభ్యులు కాసు మహేశ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ విగ్రహం మీద ఈగ వాలినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పల్నాడులో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తే ప్రతిఘటనలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయని తేల్చి చెప్పారు. ఎక్కడ వివాదాలకు ఆస్కారం ఉన్నా అక్కడ టీడీపీ నేతలు వాలిపోతున్నారని విమర్శించారు.

ఎవరైనా మరణిస్తే దానికి పార్టీ రంగు అంటగట్టి శవరాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సొంత మేనమామ, సోంత బావ చనిపోతే పాడే మోయని మాయలోడు పల్నాడుకు వచ్చి పాడే మోసి సింపతి పొందాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు స్మశానాల దగ్గర పార్టీ తెరుచుకుంటే మేలని సూచించారు. వైసీపీకి మెజార్టీలో ఉన్న గ్రామంలో సామరస్యంగా ఉన్న జొన్నలగడ్డలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ విగ్రహాలు పక్కపక్క ఉంటే చూడటానికి ఇంత బాగుంటే.. ఇలా ఉండటం ఇష్టంలేని టీడీపీ నేతలు విగ్రహాల ద్వంసం, అపహరణకు పూనుకుని గ్రామంలో గొడవలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు చంద్రబాబు

జొన్నలగడ్డలో వైఎస్ఆర్ విగ్రహ అపహరణ చాలా బాధాకరమని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మానాయుడు అన్నారు. రైతుల సత్వతోముఖాభివృద్ధికి నిరంతరం పాటుపడిన వ్యక్తి విగ్రహాన్ని ఆయనపై ప్రేమతో ఎన్నో ఏళ్ల క్రితం గ్రామ వాసులు సోసైటీ ఎదురుగా నిర్మించుకుంటే.. ఇవాళ స్వార్థ రాజకీయాల కోసం ఆ విగ్రహాన్ని అపహరించిన దుర్మార్గులు టీడీపీ వాళ్లని మండిపడ్డారు. మాచర్ల, వినుకొండ, నరసరావుపేటల్లో వివాదాలు రెచ్చగొట్టాలని టీడీపీ చూస్తొందని విమర్శించారు. ఘటన జరిగితే దానిపై పోలీసులను విచారణకుడా జరగకుండా టీడీపీ నేతలు, పచ్చ మీడియా అడ్డుపడుతుందని మండిపడ్డారు. మీరప పంటకు తెగులు పట్టి పంట నాశనమైనట్లు రాష్ట్రానికి టీడీపీ చీడ పురుగులా పట్టిందని అభివర్ణించారు. పోలీసులు త్వరలోనే విగ్రహాన్ని అపహరించిన వారిని పట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు పెడుతున్న టీడీపీ

పల్నాడు ప్రశాంతంగా ఉండటం చూసి తట్టుకోలేని ఆరాచక శక్తులు ఇవాళ ఏదో రకంగా అలజడులు సృష్టించి లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నాయని వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున అన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, కుటిల రాజకీయాలు పన్నినా, బీఆర్ అంబేద్కర్ విలువలు, రాజశేఖర రెడ్డి సిద్ధాంతాలు వైసీపీని మరో 30 ఏళ్లు అధికారంలో  ఉంచుతాయని అన్నారు. రోజురోజుకు దిగజారిపోతున్న టీడీపీ చివరకు తమ మనుగడ కోసం విగ్రహాలను కూడా వదలడం లేదు అని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతలు కావాలని విగ్రహాలను ద్వంసం చేసి మత, కుల విద్వేషాలు రెచ్చగొడుతూ ఎందరో మనోభావాలను దెబ్బతీశారని.. దానికి ప్రతిఫలం రానున్న ఎన్నికల్లో అనుభవిస్తారని అన్నారు.

రెచ్చిపోయి మాట్లడటం నిమిషం పట్టదని నరసరావుపేట  ఎంపీ శ్రీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో రోజు రోజుకు ఏదో ఒక విషయంపై టీడీపీ గొడవలు చేస్తూ  పల్నాడులో ప్రశాంతత కరువైందని రాష్ట్రానికి చూపాలని ప్రయత్నిస్తుందని అన్నారు. వైసీపీ రెచ్చగొడితే రెచ్చిపోయే పార్టీ కాదని.. రాజశేఖర రెడ్డి చూపిన దారి శాంతి మార్గమని అన్నారు. టీడీపీ నేతల్లా దిగజారి భూతులు మాట్లాడితే తనకు లైకులు బాగా వస్తాయని కాని అలాంటి నీచ సంస్క్రతికి దూరంగా ఉండాలనే జగన్ చెప్తుంటారని అన్నారు. ఇవాళ గీత దాటి మనం మాట్లాడితే దాని భూతద్దంలో పెట్టి చూపించే మీడియా ఉందని కాబట్టి ఎవరు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని సూచించారు.

ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ విగ్రహావిష్కరణకు విచ్చేసిన వేలాది మంది వైఎస్ఆర్ అభిమానులకు కృతజతలు తెలిపారు. టీడీపీ నాయకులకు నీతీ న్యాయం ఉందా అని ప్రశ్నించారు. నరసరావుపేట సీటు కోసం అరవింద బాబు ఇన్ని నాటకాలు ఆడటం మంచిది కాదన్నారు. నియోజకవర్గంలో వైఎస్ విగ్రహం మీద చేయివేస్తే చేతులు తీస్తేస్తాం అని హెచ్చరించారు.

నల్లపాటి రాము లాంటి వ్యక్తులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నాడు కోడెల శివప్రసాద్ నల్లపాటి మీద దాడి చేయిస్తే.. హనీఫ్, తాము కలిసి నల్లపాటి రాముని కాపాడిన విషయాన్ని గుర్తుచేశారు. రాజకీయం చేసుకోవాలంటే చేసుకో కాని.. ఇలా విగ్రహాల జోలికి వెళ్లి నీచ రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉంటూ వచ్చామని.. ఇకపై ఎక్కడా కూడా తగ్గేది లేదన్నారు.

దమ్ముంటే రావాలని ఢీ అంటే ఢీ అనే విధంగా రాజకీయాలు ఉండాలన్నారు. వైసీపీ నాయకులను, అభిమానులను వివాదాల్లోకి లాగాలని చూస్తే పల్నాడు ముఖ ద్వారాన రాజకీయం మరోలా ఉంటదని అన్నారు. రెండ్రోజులు హస్పిటల్ లో బెడ్ మీద పడుకోని నాటాకాలాడిన అరవింద బాబు ఇవాళ ఉదయం 6 గంటలకల్లా వచ్చి ప్రాక్టీస్ కూడా చేసుకున్న విషయాన్ని ప్రజలకు తెలియజేశారు.  మరో 15   రోజుల్లో వైఎస్ గారి విగ్రహావిష్కరణ ఉండబోతుందని.. ఆ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద స్థాయిలో నిర్వహిస్తామని చెప్పారు.  దోషులను వదిలిపెట్టమని కచ్చితంగా కఠినంగా బుద్ది చెప్తామని తేల్చి చెప్పారు.

ఈ కార్యక్రమంలో నరసరావుపేట జెడ్పీటీసీ చిట్టిబాబు, ఎంపీపీ మూరబోయిన శ్రీను, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ హనీఫ్, రొంపిచర్ల జెడ్పీటీసీ పిల్లి ఓబుల్ రెడ్డి, ఎంపీపీ అల్వాల వెంకట్రావ్,  షేక్ కార్పొరేషన్ ఛైర్మన్ ఖాజా వలి మాస్టర్, ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ స్వామి మాస్టర్, క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ చింతా కిరణ్, స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ డైరెక్టర్ సుజాతా పాల్, జొన్నల గడ్డ సర్పంచ్, జొన్నలగడ్డ ఎంపీటీసీ, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, పార్టీ అభిమానులు  పాల్గొన్నారు.

Related posts

గాంధర్వగానం

Satyam NEWS

ఇంటి మార్గం మూత వృద్దాప్యంలో మాజీ పోలీస్ ఇబ్బందులు

Sub Editor

సీనియర్‌ నటి జయప్రదకు 6 నెలల జైలు శిక్ష

Satyam NEWS

Leave a Comment