38.2 C
Hyderabad
May 1, 2024 20: 23 PM
Slider ప్రపంచం

మానవాళికి, మన దేశానికి, మోడీకి ద్రోహం చేసిన నలుగురు

#Four Scientists

కరోనా వైరస్ సోకిన వారికి అందించే చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడితే గుండెకు సంబంధించిన రుగ్మతలు పెరుగుతాయనే సిద్ధాంతాన్ని వెలికి తీసుకువచ్చి ప్రపంచ మానవాళికి తీరని ద్రోహం చేశారు నలుగురు శాస్త్రవేత్తలు. నిజం.

మానవాళికి ద్రోహం చేసిన ఈ శాస్త్రవేత్తలలో ముగ్గరు మన దేశ మూలాలు కలిగిన అమెరికా డాక్టర్లు కావడం మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టింది. ప్రపంచంలో లక్షలాది మంది కరోనా రోగులను కాపాడటంతో బాటు భారత ప్రధాని నరేంద్ర మోడీకి, భారత దేశానికి మంచి పేరు తీసుకువచ్చే సువర్ణ అవకాశాన్ని కూడా ఈ శాస్త్రవేత్తలూ కాలరాశారు.

కొంప ముంచిన నివేదిక

ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయత ఉన్న, దాదాపు 200 ఏళ్లుగా ప్రచురితం అవుతున్న లాన్సెట్, NEJM అనే పత్రికల్లో ఆ మధ్య కాలంలో ఒక రిపోర్ట్ పబ్లిష్ అయింది. సుమారు 670 ఆసుపత్రుల నుండి రోగుల సమాచారం సేకరించి , అధ్యయనం చేసి ఈ నివేదిక రూపొందించినట్లుగా రచయితలు అందులో పేర్కొన్నారు.

ఈ నివేదిక ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకాన్ని ఆపేశారు. ఈ నివేదికపై అనుమానం వచ్చిన 180 మంది వైద్య పరిశోధకులు,  ఈ అధ్యయనానికి సంబంధించిన బేస్ డేటా ఇవ్వమని ఆ పత్రికల్ని కోరారు. ఆ పత్రికలు, ఆ నివేదిక రూపొందించిన సైంటిస్టులని బేస్ డేటా ఇవ్వాల్సిందిగా కోరారు.

రిపోర్టును ఉపసంహరించుకున్న లాన్సెట్

అయితే ఆ సైంటిస్టులు డేటా ఇవ్వలేదు. దానితో అనుమానం వచ్చిన ఆ పత్రికలు ఆ రిపోర్ట్ ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కరోనా  మరణాల సంఖ్య బాగా పెరిగింది. బహుశః హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉపయోగించి ఉంటే, కొన్ని వేల ప్రాణాలు కాపాడగలిగేవారేమో.

లాన్సెట్ లో ప్రచురితమైన ఈ పరిశోధనా వ్యాసాన్ని ఐసీఎంఆర్ (భారతీయ వైద్య పరిశోధనా సంస్థ) అప్పటిలోనే కొట్టి పారేసింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ఉండదని చెప్పింది కానీ ఎవరూ నమ్మలేదు. అదే విధంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడాల్సిందేనని తన దేశంలో గట్టిగా చెప్పారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ కేవలం మన దేశంలోనే తయారవుతుంది.

120 దేశాలకు మందు పంపిన భారత్

అందుకే ట్రంప్ ఆ మందు తమకు పంపించమని భారత్ ను గట్టిగా కోరారు. ఆయన అడిగే నాటికే భారత్ 120 దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ పంపేందుకు ఏర్పాట్లు చేసింది. భారత్ పంపిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడి చాలా దేశాలు మంచి ఫలితాలు సాధించాయి. మన దేశంలో కూడా ఐసీఎంఆర్ చెప్పినట్లు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను కరోనా రోగులకు వాడుతూనే ఉన్నారు.

భారత దేశ ప్రాభవాన్ని అడ్డుకున్న ఆ శాస్త్రవేత్తలు ఇప్పుడు సిగ్గుతో తలవంచుకుంటున్నారు. జరిగిన పొరబాటుకు క్షమాపణలు చెబుతున్నారు కానీ మానవాళి విపరీతంగా నష్టపోయింది. ఆ ముగ్గురు సైంటిస్టుల  పేర్లు మందీప్ ఆర్ మెహ్రా, సపన్ దేశాయ్, అమిత్ పటేల్ మరొక అమెరికన్ సైంటిస్టు ఫ్రాంక్ రుశ్చితజ్కా.

ఏదైనా ప్రలోభానికి లొంగారా?

ఈ సైంటిస్టులు ఏదైనా ప్రలోభానికి లొంగి ఇలా చేసారా అనే విషయం తెలియదు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వల్ల మనదేశానికి, మోడీకి, ఆ మందుని ప్రమోట్ చేసిన ట్రంప్ కి మంచి పేరు వచ్చింది. దాన్ని చెడగొట్టడానికి ఇలాంటి ప్రయత్నం జరిగిందేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

Related posts

నోముల మృతి‌ డీకే అరుణ దిగ్భ్రాంతి

Sub Editor

ఫార్మర్స్ వార్: రాజధాని రైతుల పోరాటం ఉద్ధృతం

Satyam NEWS

ముంబయిలో విదేశీ కరెన్సీ పట్టివేత..

Bhavani

Leave a Comment