38.2 C
Hyderabad
April 28, 2024 20: 59 PM
Slider వరంగల్

హన్మకొండ బాలసముద్రం బాలికల హాస్టల్ లో ఉచిత వైద్య శిబిరం

#medicalcamp

హన్మకొండ బాలసముద్రం లోని ఆనంద నిలయం అనాధ బాలికల హాస్టల్ లో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

ఈ వైద్య శిబిరంలో డాక్టర్ మాధురి అక్కడి పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు అందించారు.

మందులు, కిషోర బాలికలకు సానిటరీ నాప్ కీన్స్  డాక్టర్ అనితా రెడ్డి అందించారు. డాక్టర్ మాధురి వైద్య పరీక్షల అనంతరం పిల్లలతో మాట్లాడుతూ శరీర, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, సమతుల్యత, పోషకాహారం తీసుకోవాలని, వైద్యులను సంప్రదించకుండా ఎటువంటి మందులు వాడకూడదు అని తెలిపారు. డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులే కాక  సేవా,  సమాజ హిత కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ సుజాత, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కొత్తగూడెంలో పోటీ చేస్తాం

Bhavani

ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

Satyam NEWS

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనను ప్రజలు కోరుకుంటున్నారు

Satyam NEWS

Leave a Comment