37.2 C
Hyderabad
May 2, 2024 13: 20 PM
Slider జాతీయం

ఆపరేషన్ లోటస్: జార్ఖండ్ లో సోరేన్ ప్రభుత్వానికి ఎసరు?

#jarkhandpolitics

జార్ఖండ్‌ లో హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ పావులు కదుపుతున్నదా? పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి 48 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ విషయం రాజకీయ వర్గాలలో పెను దుమారం రేపింది. హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోందని జార్ఖండ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు టిర్కీ అన్నారు. ఇది బీజేపీ ‘ఆపరేషన్ కమలం’లో భాగమని, అయితే ఇది పరిపక్వానికి రాక ముందుగానే బహిర్గతమైందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయమై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చేసిన ట్వీట్ లో ఆయన బీజేపీపై మండిపడ్డారు.

హౌరాలో ‘ఆపరేషన్ లోటస్’ బహిర్గతమైందని ఆయన ట్వీట్‌లో రాశారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్-దేవేంద్ర (ఈ-డి) ద్వయం చేసిన పనిని జార్ఖండ్‌లో చేయాలన్నది ఢిల్లీలో ‘హమ్ దో’ గేమ్ ప్లాన్ అపి అన్నారు. జైరాం రమేష్ తర్వాత జార్ఖండ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు టిర్కీ ప్రకటన వచ్చింది.

ఈ పరిణామాలకు బీజేపీయే కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోందని వారు అన్నారు. కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్ ప్రకటన చేశారు. దోపిడిలో రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు ఇంత మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి.

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాహు కూడా కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి పెరిగిపోతోందని అన్నారు. ఇంతకు ముందు కూడా జార్ఖండ్‌లో అధికారుల ఇళ్లలో భారీగా నగదు పట్టుబడింది. కష్టపడి సంపాదించిన ప్రజాధనాన్ని ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు.

పోలీసులు వారిని పట్టుకోవడంతో అది తెరపైకి వచ్చింది అని అన్నారు. జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెజారిటీ సంఖ్య 41. 2019లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. హేమంత్ సోరెన్‌కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా గరిష్టంగా 30 సీట్లు, బీజేపీ 25, కాంగ్రెస్‌కు 18 సీట్లు వచ్చాయి. 2019లో హేమంత్ సోరెన్ కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఐల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

దీంతో కూటమి ఎమ్మెల్యేల సంఖ్య 51కి చేరింది. బీజేపీ నంబర్ టూ పార్టీ కాబట్టి నేటికీ ప్రతిపక్షంలో కూర్చుంది. బీజేపీకి ఆల్ జార్ఖండ్ విద్యార్థి సంఘం, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాబట్టి వారి సంఖ్య 30. నిజంగానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని భావించాలంటే.. మెజారిటీ మార్కును తాకేందుకు మరో 11 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఇదొక్కటే కాదు, కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి కూడా విచ్ఛిన్నం కావాలి. ఇది రెండు పరిస్థితులలో సాధ్యమవుతుంది.

రెండు ప్రత్యామ్నాయాలు ఏమిటంటే

1. JMM, కాంగ్రెస్ కూటమిని విచ్ఛిన్నం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది పెద్ద కష్టమైన పనేం కాదు. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్‌ల కూటమి విచ్ఛిన్నమైతే, జేఎంఎంకు మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీ అధికారంలోకి రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ 30 మంది కూటమి ఎమ్మెల్యేలు, 30 మంది జేఎంఎం ఎమ్మెల్యేలను కలుపుకుంటే ఈ సంఖ్య 60కి చేరుతుంది. అయితే, ఈ నిర్ణయం JMM నాయకత్వం పైనే ఆధారపడి ఉంది. జేఎంఎం నాయకత్వం కోరుకుంటేనే అది సాధ్యమవుతుంది.

2. అధికార పార్టీ ఎమ్మెల్యేలను తమ వెంట తీసుకురావడం: ప్రస్తుతం 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో పాటు ఒక ఆర్జేడీ, ఒక ఎన్సీపీ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఆ ఎమ్మెల్యేల కూటమిని విచ్ఛిన్నం చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు తెగదెంపులు చేసుకుంటే బీజేపీ సులువుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు.

మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు కలిసిపోతారు కాబట్టి, ఈ ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా వర్తించదు. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ద్వారా ఎన్సీపీ ఎమ్మెల్యే బీజేపీతో సాన్నిహిత్యాన్ని చాటుకున్నారు. అందువల్ల త్వరలో అక్కడ ప్రభుత్వం ఢమాల్ మనడం ఖాయంగా కనిపిస్తున్నది. బీజేపీ వేసే పావులతో ఇది మరింత త్వరగా జరిగే అవకాశం ఉంది.

Related posts

యాదవులు, కుర్మల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

Satyam NEWS

మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన నేతలు

Satyam NEWS

కాంట్రాక్ట్ పారామెడికల్ స్టాఫ్ ను క్రమబద్దీకరించండి

Satyam NEWS

Leave a Comment