31.2 C
Hyderabad
May 3, 2024 01: 27 AM
Slider కరీంనగర్

రేపటి నుండే పేదలకు ఉచిత బియ్యం పంపిణీ

#Minister Gangula Kamalakar

రాష్ట్రంలో రేపటి నుంచి పేదలకు ఉచితంగా 10 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కరీంనగర్ లో మీడియతో మాట్లాడుతూ  ప్రధాని మోదీ ప్రకటించిన 5 కిలోలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 5  కిలోలు అందజేస్తుందని ప్రకటించారు.

కేంద్రం కేవలం ఆహారభద్రత కార్డుదారులకే ఇస్తుందని అన్నారు….. కానీ  రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ లబ్ధిదారులందరికీ పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. దీనితో 2 కోట్ల 79 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం జులై నుంచి నవంబర్​ వరకు ఇస్తామని స్పష్టం చేశారు.

బియ్యం పంపిణీ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభిస్తారు. ఈ పంపిణీ జూలై నుంచి నవంబర్ నిరంతరయంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం లో ఆర్ధిక మాంద్యం నెలకొన్నప్పటికి …నిరుపేదలు పస్తులుండకూడదనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.

ఈ నిర్ణయంతో రాష్ట్రానికి ప్రతి నెల 50 కోట్ల రూ అదనపు భారం పడుతుందని …5 నెలలకు 250 కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రంలో 1 కోటి 79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నెలకు అవసరం పడుతుందని, కానీ ఇప్పుడు నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో అదనంగా  2 కోట్ల 89 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్ వై. సునిల్ రావు ,కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్  రుద్ర రాజు ,కార్పొరేటర్లు ఐలేందేర్ యాదవ్ కంసాల శ్రీనివాస్ ,చాడగొండ బుచ్చి రెడ్డి ,గుగ్గిళ్ల జయశ్రీ ,కొల ప్రశాంత్ లు పాల్గొన్నారు.

Related posts

జగన్ ప్రభుత్వంపై మోదీ అసాధారణ ప్రేమ

Satyam NEWS

చట్టబద్ద అనుమతులే లేని ఎల్ జి పాలిమర్స్

Satyam NEWS

రాజధాని ప్రాంతంలో నత్తనడకన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

Satyam NEWS

Leave a Comment