26.7 C
Hyderabad
May 3, 2024 10: 50 AM
Slider ముఖ్యంశాలు

సంగీత నిలయం కోసం నిధుల సేకరణ కై బ్రోచర్ విడుదల

#musiccollege

కళలకు కాణాచైన విజయనగరం మరి సంగీత నిలయం రూపుదిద్దంకోబోతోంది.ఇందుకోసం నిధుల సేకరణ కై నిర్వాహకులు నడుం బిగించారు. ఈ మేరకు నగరంలో శంకరమఠంలి ఎఫ్.ఎఫ్.ఏ,ఘంటసాల కళాపీఠం లు నిర్వాహకులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట బుక్కావీధి లో నిర్మాణం జరుగుతున్న ఆర్యసోమయాజుల కాశీపతిరావు స్మారక భవన నిధుల కోసం శంకర మఠంలో పత్రికా ముఖంగా ఒక కరపత్రం విడుదల చేయడం జరిగింది.. దీనిలో విజయనగరం వారే కాకుండా సంగీత, సాహిత్య ప్రియులు ప్రపంచం నలుమూలల ఎవరైనా విరాళం www.ffa1958.org. అనే వెబ్ సైట్ లో పంపే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధ్యక్షుడు ధవళ సర్వేశ్వర రావు వివరించారు.

కార్యదర్శి డాక్టర్ మండపాక రవి మాట్లాడుతూ విజయనగరం సంగీత సాహిత్య వైభవం చాటిచెప్పే విధంగా అన్ని హంగులతో ఈ భవన నిర్మాణం జరుగనున్నట్లు దీనిలో సంగీత, సాహిత్య కార్యక్రమాలతో పాటు సంగీత శిక్షణ, త్యాగరాజ స్వామి మందిరం, అన్ని లలిత కళలకు సంబంధించిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించబోనున్నట్లు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో దేవరాజు గోపాల కృష్ణ, భీష్మరావు, హరి, సూర్యనారాయణ, అబ్బులు, ప్రాత రాజేశ్వరరావు, సోమశర్మ తదితరులు పాల్గొన్నారు… ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ గౌరవ అధ్యక్షులు ఉలిమిరి అప్పల నరసింహం, వారి కుమారులు గౌరీశంకర్, డాక్టర్ సోమయాజులు శ్రీరామ సేవాసమితి తరఫున 1లక్షా,10,116 విరాళం ప్రకటించారు. ఈ భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి అయ్యేటట్లు అందరూ విరివిగా విరాళాలు ఇవ్వాలని సంస్థ సభ్యులు కోరారు.

Related posts

వితంతువులకు సంక్షేమ పథకాలు అందించాలి

Satyam NEWS

దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోండి

Satyam NEWS

వి.ఎస్.యు లో ముగిసిన సుసంపన్న వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు

Satyam NEWS

Leave a Comment