28.7 C
Hyderabad
April 28, 2024 09: 34 AM
Slider నెల్లూరు

వి.ఎస్.యు లో ముగిసిన సుసంపన్న వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు

#SimhapuriUniversity

నెల్లూరు జిల్లా లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సోషల్ విభాగం ఆధ్వర్యంలో నైపుణ్యాలపై జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యూనివర్సిటీ రెక్టార్ ఆచార్య చంద్రయ్య మాట్లాడుతూ ఇలాంటి శిక్షణ తరగతులను వినియోగించుకుని తద్వారా సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థు లు తయారవ్వాలని తెలియజేశారు.

విశిష్ట అతిథిగా విచ్చేసిన ఐటిడిఎ పిఓ మణి కుమార్ మాట్లాడుతూ వృత్తిపరమైన నైపుణ్యాలను కలిగి ఉండటం చాలా అవసరమని విద్యతోపాటు సాంకేతికపరమైన అంశాల పట్ల నైపుణ్యం సాధించలేకపోతే అభివృద్ధి సాడించలేమని తెలిపారు.

యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విజయ్ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యాలను విద్యార్థుల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఈ నాటి శిక్షణ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నుంచి హాజరైన హాజరైన ఆచార్య నరసింహారావు విద్యార్థులకు రైటింగ్ స్కిల్స్ పై తర్పిదు ఇచ్చారు. అలాగే అపోలో మెడికల్ కాలేజ్ చిత్తూరు నుంచి హాజరైన డాక్టర్ మహేంద్ర  చౌదరి విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ మీద తర్ఫీదు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కే సునీత సోషల్ వర్క్ విభాగం అధ్యాపకులు డాక్టర్ సుబ్బరాజు అలాగే కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ సునీత కార్యక్రమ కో కోఆర్డినేటరు డాక్టర్ బి.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Related posts

తేమ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పువ్వాడ

Satyam NEWS

జగన్ పాలనలో న్యాయానికి సంకెళ్లు…!

Satyam NEWS

ఆర్. అండ్ .బి. గ్రౌండ్ ను మినీ స్టేడియం గా మార్చండి

Satyam NEWS

Leave a Comment