29.7 C
Hyderabad
May 1, 2024 05: 44 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఎన్నికల సంఘం కార్యదర్శిగా వాణీమోహన్

#G Vani Mohan IAS

ఇప్పటి వరకూ ఖాళీగా ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి కార్యదర్శిగా జీ.వాణీమోహన్ ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎఎస్ (1996) బ్యాచ్ కి చెందిన జి.వాణీమోహన్ ప్రస్తుతం కమిషనర్, కో-ఆపరేషన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ గా పనిచేస్తున్నారు.

ఆమెను రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా నియమిస్తూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఎపి డెయిరీ డెవలప్ మెంట్ కో ఆపరేటీవ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా, సహకార శాఖ కమిషనర్ గా, ఆర్కియాలజీ, మ్యూజియమ్స్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వరిస్తారని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘానికి కార్యదర్శి పోస్టు ఇంత కాలం ఖాళీగా ఉన్నది. జాయింట్ సెక్రటరీ ఏ వి సత్య రమేష్ కార్యదర్శిగా వ్యవహరించేవారు. ఆ తర్వాతి స్థానంలో జాయింట్ డైరెక్టర్ జీ వీ సాయి ప్రసాద్ ఉన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తనంత తానుగా పదవి బాధ్యతలు స్వీకరించినట్లు ఇచ్చిన సర్క్యులర్ పై జీవీ సాయి ప్రసాద్ సంతకం చేశారు. ఇప్పుడు సెక్రటరీగా ఐఏఎస్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

Related posts

చేంజ్ పాలసీ:మాత్రలు వికటిస్తున్న పట్టించు కోరేం

Satyam NEWS

ప్రత్యేక సబ్జెక్టు గా భగవద్గీత

Sub Editor 2

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు న్యూయార్క్, సింగపూర్

Satyam NEWS

Leave a Comment