40.2 C
Hyderabad
April 26, 2024 11: 16 AM
Slider నెల్లూరు

వి ఎస్ యూ ఆధ్వర్యంలో ఉన్నత్ భారత్ అభియాన్

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, ఉన్నత్ భారత్ అభియాన్ పథకం క్రింద పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గంగిరెద్దుల కాలనీ , కంటేపల్లి గ్రామములో నిర్వహించారు. గ్రామము లో పచ్చదనాన్ని పెంచేందుకు విశ్వవిద్యాలయ కృషి చేస్తున్నది అని ఉన్నత్ భారత్ అభియాన్ సమన్వయకర్త డా కె. సునీత తెలిపారు.

ముఖ్యముగా పండ్ల మొక్కలు పెంచడం చాలా అవసరము అని,దానివలన భావి తరములు కూడా దాని ఫలితం పొందుతారు అని ఉన్నత్ భారత్ అభియాన్ సహా సమన్వయకర్త డా ఆర్.మధుమతి తెలిపారు. మొక్కల పెంపకానికి తీసుకోవలసిన చర్యల గురించి గ్రామస్థులకు తెలియచేస్తూ,ఈ విషయంలో ఉన్నత్ భారత్ అభియాన్ పథకం భాగస్వామ్యం అభినందనీయం అని ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ డా. ఉదయ్ శంకర్ అల్లం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విల్లేజ్ సెక్రెటరీ హరి, విశ్వవిద్యాలయ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ఫరీనా బేగం కు మ‌ద్ద‌తుగా విరాళాల సేక‌ర‌ణ‌

Sub Editor

చారిత్రక కట్టడాలకు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులు

Murali Krishna

అవినీతి, కుటుంబ పాలన ఎంతో కాలం ఉండదు

Satyam NEWS

Leave a Comment