38.2 C
Hyderabad
April 28, 2024 22: 36 PM
Slider ఆదిలాబాద్

ఇంకో పరిశ్రమలో గ్యాస్ లీక్ తో భీతిల్లిన కార్మికులు

#J K Paper Mill

తెలంగాణలోని ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా లోని సిర్పూర్ కాగజ్‌నగర్ లోని ఎస్పీఎం పేపర్ పరిశ్రమలో పెను ప్రమాదం జరిగింది. ఒక్క సారిగా క్లోరిన్ లీక్ కావడంతో కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. సిఎల్ఓ 2 ఫ్లాట్ వద్ద ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గ్యాస్ లీకైంది.

పేపర్ 1, 2 ఫ్లాట్లకు వెళుతున్న క్లోరిన్ లీకవడంతో సమీపంలో విధులు నిర్వహిస్తున్న 20 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. బాయిలర్‌కు అత్యంత సమీపంలో క్లోరీన్ గ్యాస్ లీకవడంతో ఒక్కసారిగా కార్మికులు పరుగులు తీశారు. ఒక్కరు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటహుటిన సమీపంలోని‌ ఓ ప్రైవేటు ఆస్పత్రికి‌ తరలించారు.

ప్రస్తుతం ఆ కార్మికుడి పరిస్థితి క్షేమంగానే ఉన్నట్టు సమాచారం. మరో ముగ్గురు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. క్లోరిన్ గాఢత తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది.

ఈ ఘటన పై స్పందించేందుకు జేకే పేపర్ మిల్ యాజమాన్యం నిరాకరించింది. లాక్ డౌన్ కావడంతో పూర్తి స్థాయిలో బాయిలర్స్ వినియోగంలో లేకపోవడం పేపర్ బ్రైట్ నెస్ పెంచేందుకు వినియోగించే క్లోరీన్ లిక్విడ్ ఉష్ణోగ్రత 15 డిగ్రీలు మించడంతో ఈ ఘటన జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు బయటకి పొక్కకుండా జేకే పేపర్ మిల్ యాజమాన్యం జాగ్రత్తలు చేపట్టింది. ఘటన జరగడంతో అలర్ట్ అయిన సిర్పూర్ పేపర్ మిల్ జేకే యాజామాన్యం కార్మికులను అర్థాంతరంగా ఇంటికి పంపించింది. దీంతో పేపర్ మిల్లులో ఏం జరుగుతుందో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

మఠంపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ నేతల నిరసన

Satyam NEWS

టైం పాస్ క్రైమ్ : ఓ నగ్న మహిళ పోలీసులనే పరేషాన్ చేసింది

Satyam NEWS

గ్రిడ్ తో కనెక్ట్ చేసిన ఫోటోవోల్టాయిక్ సిస్టమ్‌పై అతిథి ఉపన్యాసం

Satyam NEWS

Leave a Comment