Slider కర్నూలు

ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో రూ.5 కోట్ల బంగారం స్మగ్లింగ్

#goldsmuggling

కర్నూలు పట్టణ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు లోని SEB చెక్ పోస్ట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున భారీ ఎత్తున స్మగ్లింగ్ బంగారం పట్టుబడింది. SEB సి ఐ మంజుల, యస్ ఐ  ప్రవీణ్ కుమార్ నాయక్ వారి సిబ్బంది జరిపిన వాహన తనిఖీల్లో ఈ బంగారం బిస్కెట్లు పట్టుబడ్డాయి. హైదరాబాదు నుండి కోయం బత్తూరు కు వెళుతున్న NL O1 B 1149 స్వామి అయ్యప్ప ట్రావెల్స్ అనే ప్రయివేటు స్లీపర్ బస్సులో తనిఖీ చేయగా ఈ విషయం బయట పడ్డది.

అందులో తమిళనాడు రాష్ట్రం, సేలం పట్టణం కు చెందిన దేవ రాజు,సెల్వ రాజు,కుమార వేలు, మేయలాగ మురుగేశన్, కొయంబత్తురు కు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తుల బ్యాగుల్లో సుమారు 28.5 కేజీల  బరువు గల వెండి బిస్కెట్లు, వెంకటేశ్ అనే వ్యక్తి జాకెట్ లో 8.250 కేజీల బంగారు బిస్కెట్లు దొరికాయి. అంతే కాదు వారందరి స్లీపర్ సీట్ల కింద 90 లక్షల పైగా నోట్ల కట్టలు గుర్తించారు. కోయంబతూరు కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ప్రత్యేకంగా తయారు చేయించిన జిప్  జేబులలో సుమారు 8 కేజీల పైగా బరువు గల బంగారు బిస్కెట్లు దాచి వుంచుకున్నాడు.

వీరందరూ హైదరాబాదు లోని వివిధ జువెలరి షాపులు నుండి ముడి బంగారు, వెండి తీసుకొని తమిళనాడు రాష్ట్రం లోని సేలం పట్టణం లో ఆభరణాలు తయారు చేసి తిరిగి వాటిని హైదరాబాదు జువేలరి షాపుల్లో ఆపగిస్తారని, అందుకు గాను వీరికి తయారి మజూరి ( మేకింగ్ ఛార్జి) ఇస్తారని చెప్పారు. ఇదంతా ఎక్కడా లెక్కలు చూపని బంగారం గా SEB పోలీసులు గుర్తించారు.  గుర్తించిన వెండి విలువ సుమారు రూ. 18,52,000/(సుమారు పద్దేనిమిది లక్షల,యాభై రెండు  రూపాయలు) వుంటుందని, బంగారు విలువ సుమారు రూ. 3,96,000000/ (మూడు కోట్ల తొంబై ఆరు లక్షలు)వుంటుందని పోలీసులు తెలిపారు.

నగదుతో సహా మొత్తం రూ.5కోట్ల,4 లక్షల,64 వేలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆభరణాలకు, బంగారు, వెండి, బిస్కెట్లు కు, నగదుకు సంబంధించి ఎలాంటి జి యస్ టి బిల్లులు, ఈ – వే బిల్లు, ట్రావెలింగ్ ఓచర్ ఏవీ లేవు. సదరు వ్యక్తులను ,పట్టుబడిన, నగదు, బంగారు,వెండి బిస్కెట్లు ను తగిన ఆధారాల ధృవీకరణ పత్రాల పరిశీలన కోసం కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్ కు తదుపరి విచారణ నిమిత్తం పంపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్  ,ఖాజా, మహమ్మద్, కానిస్టేబుళ్లు ,SPO సుంకన్న, సుందర్, విజయ భాస్కర్ లు పాల్గొన్నారు.

Related posts

లాక్ డౌన్ పై ప్రజాభిప్రాయం కోరిన మంత్రి

Satyam NEWS

గ్రీవెన్స్: తప్ప తాలు పేరిట కోత పెట్టడం సరికాదు

Satyam NEWS

Red Alert: ఏజెన్సీ ప్రాంతంలో విష జ్వరంతో మహిళ మృతి

Satyam NEWS

Leave a Comment