28.7 C
Hyderabad
April 27, 2024 05: 44 AM
Slider మహబూబ్ నగర్

రైతుల్ని మోసం చేసే ప్రయత్నాలు మానుకోవాలి

#kollapur

ఏల్లూరు శివారు రైతుల కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి తక్షణమే ఆదుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఎర్రోళ్ల బండ కింద ఉన్న సర్వే నెంబరు 371  375 సర్వే లో దాదాపు పదిహేను మంది రైతులు 33 ఎకరాల 27 గుంటల భూమిని కోల్పోవడం జరిగింది.

ఈ రైతులకు ఒక ఎకరాకు 170000 ఇచ్చి రైతులను మోసం చేసే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. అక్కడ భూమిని కోల్పోతున్న రైతులకు ఒక ఎకరాకు 30 లక్షలు ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని వారు కోరారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకొని నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు.

లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాలలచైతన్య సమితి  రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రామదాసు, దళిత దండు వ్యవస్థాపక అధ్యక్షులు బచ్చలకూర బాలరాజు సంఘాల ద్వారా స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ లో రిలే నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. రైతులకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రాందాస్ బచ్చలకూర బాలరాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు సురేందర్ మండల అధ్యక్షులు జిలకర కృపాకర్ తాలూక ఇన్చార్జి పాల్గొన్నారు.

Related posts

మహారాష్ట్ర బిజెపి: వ్రతం చెడ్డినా కూడా ఫలితం దక్కలేదు

Satyam NEWS

సినిమా ధియేటర్లను మూసివేయడం లేదు: మంత్రి

Satyam NEWS

కౌంటర్: జగన్ కు మినహాయింపు ఇవ్వద్దని కోరిన సీబీఐ

Satyam NEWS

Leave a Comment