Slider నల్గొండ

కరోనా ట్రాజెడీ: ఆగిన మగ్గం ఆకలితో నేతన్నలు

#weaversOfTelangana

దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితుల్లో చేనేత మగ్గాలు ఆగిపోయి నేతన్నలు ఆకలితో బాధపడుతున్నారని తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అవ్వారి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక మునుగోడు సహకార సంఘ భవనంలో తెలంగాణ పద్మశాలి యువజన సంఘం ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జరిగిన దీక్షలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ప్రజలు అత్యధికంగా వ్యవసాయం తర్వాత ఉపాధి పొందేది చేనేత పరిశ్రమలేనని అన్నారు. రాష్ట్రంలో సర్వే లెక్కల ప్రకారం 20 వేల మంది చేనేత కార్మికులు ఉండగా మరో 25 మంది కార్మికులు వారి పై ఆధారపడి ఉన్నారని అన్నారు. అదే విధంగా సుమారు లక్షా ఇరవై వేలమంది కార్మికులు పరోక్షంగా ఉపాధి పొందుతుండగా అనుబంధ రంగాలకు చెందిన వారు సుమారు రెండు లక్షలకు పైగా కార్మికులు ఉంటారని ఆయన తెలిపారు.

వారికి ప్రభుత్వం తక్షణ సహాయం కింద పదివేల రూపాయలు అందించాలని కోరారు. అంతేకాకుండా పథకం కింద ప్రస్తుతం కార్మికుడు తన రూపాయలు ఆరు నెలల పాటు ప్రభుత్వ చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మాస్టర్స్ బేవర్స్, చేనేత సంఘాలు పేరుకుపోయిన ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, చేనేత రంగాన్ని కాపాడాలని కోరారు.

 రంగులను డిపోల ద్వారా అందించి చేనేత కార్మికులకు పని కల్పించాలని కోరారు. కార్మికులు ఉపాధిలేక పెట్టుబడి ఇబ్బందుల్లో ఉన్నారని వారికి పెట్టుబడి సాయం కింద ప్రతి కార్మికునికి 50,000 రూపాయలు అందించి ఆదుకోవాలని కోరారు. లేకపోతే కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మునుగోడు చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షులు పరమేశం కోశాధికారి కోణం జగన్నాథం సంఘం మేనేజర్ కందగట్ల గణేష్ తదితరులు హాజరయ్యారు.

Related posts

రష్యా అతి పెద్ద యుద్ధ నౌకను ముంచేసిన ఉక్రెయిన్

Satyam NEWS

అక్రమ భారీ షెడ్డు నిర్మాణం: పట్టించుకోని టౌన్ ప్లానింగ్ ఎ సి పి

Satyam NEWS

సమస్యలు లేని గ్రామాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం

Satyam NEWS

Leave a Comment