36.2 C
Hyderabad
April 27, 2024 22: 53 PM
Slider ముఖ్యంశాలు

స్టార్ మా: ‘ఇంట్లోనే ఉండండి, ఆన్‌లైన్‌లో బిల్లు కట్టండి’

#StarMAA

కరోనా లాక్ డౌన్ సమయంలో వినోదానికి అంతరాయం కలగకుండా స్టార్ ఇండియాలో భాగమైన స్టార్ మా వినియోగదారుల భద్రత కోసం ‘ఇంట్లోనే ఉండండి, ఆన్‌లైన్‌లో బిల్లు కట్టండి’ ప్రచారాన్ని ప్రారంభించింది. నెలకు 700 మిలియన్ల మందికి పైగా వీక్షకులను చేరుకునే స్టార్ ఇండియా నెట్‌వర్క్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తమ వినియోగదారుల భద్రతను లక్ష్యంగా చేసుకుని – ‘ఇంట్లోనే ఉండండి, ఆన్‌లైన్‌లో బిల్లు కట్టండి’ పేరిట ప్రచారం మొదలు పెట్టింది.

కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో బయటకు రాకుండా ఇంటి నుంచే టీవీ బిల్లులు చెల్లించాలని టీవీ ప్రేక్షకులను స్టార్ మా కోరుతున్నది. టీవీ బిల్లు చెల్లింపులకు ఆన్‌లైన్ సదుపాయాలను వినియోగించుకోవాల్సిందిగా స్టార్ మా తెలిపింది. “ఇంటి వద్దనే ఉండండి, సురక్షితంగా ఉండండి అని ప్రోత్సహిస్తూ వినోదాన్ని పొందేందుకు ఆన్‌లైన్‌లో టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బిల్లులను చెల్లించాల్సిందిగా చెబుతున్నామని స్టార్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ హెడ్- డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ గుర్జీవ్ సింగ్ కపూర్ అన్నారు.

అంతరాయం లేకుండా వినోదాల విందు

ఈ ఆపద సమయంలో కూడా ఆన్‌గ్రౌండ్ పనిచేస్తున్న మా కేబుల్, డీటీహెచ్ భాగస్వాములకు చెందిన సాహసోపేత బృందాలను ప్రశంసిస్తున్నామని ఆయన అన్నారు. వీక్షకుల కోసం సేవల పరంగా ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు భరోసా కల్పించేందుకు చేస్తున్న వారి ప్రయత్నాలను అభినందిస్తున్నాం” అని అన్నారు.

స్టార్ మా నెట్‌వర్క్ బిజినెస్ హెడ్ అలోక్ జైన్ మాట్లాడుతూ “బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటుగా సెలబ్రిటీ హోమ్ వీడియోలను అద్భుతంగా మిళితం చేసి మన తెలుగు వీక్షకులకు సంపూర్ణ వినోదాన్ని అందించడానికి స్టార్ మా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది.

మా వినియోగదారుల భద్రత, ఆరోగ్యం తొలి ప్రాధాన్యత అయిన ఈ కీలక సమయంలో, మేము ప్రతి ఒక్కరినీ తమ కేబుల్/డీటీహెచ్ బిల్లులు లేదా మరేదైనా యుటిలిటీ బిల్లును ఆన్‌లైన్ విధానంలో చెల్లించమని కోరుతున్నాం. అదే సమయంలో ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా మరికొంత కాలం ఇళ్లలోనే ఉండాల్సిందిగానూ అభ్యర్థిస్తున్నాం.

ఇది ఇంటిలోనే ఉండండి, సురక్షితంగా ఉండండి అంటూ చెప్పేందుకు మనకోసం మా ప్రయత్నం” అని అన్నారు. స్టార్ ఇండియా తమ నెట్‌వర్క్ ఛానెల్స్‌పై వినోదపరంగా మరింత ఆసక్తిని జోడించింది. అత్యంత ప్రజాదరణ పొందిన క్లాసిక్ షోస్ అయిన మహాభారత్ మొదలు ఎన్నో ఆసక్తికరమైన షోస్ తీసుకువచ్చింది.

నాన్ ఫిక్షన్ సీరియళ్లతో కొత్త హంగులు

స్టార్ మా టీవీ వీక్షకులు ఇప్పుడు తమ అభిమాన సీరియల్స్ కార్తీక దీపం, వదినమ్మ, గృహలక్ష్మి మరెన్నో నాన్ ఫిక్షన్ సీరియళ్లతో పాటుగా వీక్షించవచ్చు. ఈ ఛానెల్ ఇప్పుడు చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు సినిమాలను ప్రసారం చేస్తుండటంతో పాటుగా ప్రతి శుక్రవారం ఫ్యామిలీ మూవీస్‌ను ప్రసారం చేస్తుంది.

ఈ లాక్‌డౌన్ వేళ తమ వీక్షకుల కోసం కొన్ని నాన్ ఫిక్షన్ ఫార్మట్స్‌ను సైతం తీసుకువచ్చింది. వీకెండ్ బ్లాక్‌బస్టర్ షోకు కొనసాగింపుగా ఇస్మార్ట్ జర్నీ, పూర్తి సరికొత్త రూపులో బిగ్‌లాక్‌డౌన్ ఛాలెంజ్ వంటివి సైతం ఉన్నాయి. ఈ బిగ్‌లాక్‌డౌన్ ఛాలెంజ్‌లో స్టార్ మా సెలబ్రిటీలు ఇంటి పనులతో ఒకరినొకరు సవాల్ విసురుకుంటుంటారు.

స్టార్ మా గోల్డ్ లో సినీ వినోదం

స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్ సైతం కొన్ని ఆసక్తికరమైన సినీ వినోదాన్ని సృష్టించాయి. సినీ వినోదసాగరంలో తేలియాడుతూ ఇళ్లలోనే కుటుంబాలు ఉంటాయన్న భరోసానూ ఇవి అందిస్తాయి. స్టార్ మూవీస్ ఇప్పుడు చిన్నారులకు ఇష్టమైన చిత్రాలైన మేరీ పాపిన్స్ రిటర్న్స్, డుంబో మరియు నట్‌క్రాకర్ మరియు ఫోర్ రియల్మ్స్ ఆన్ ప్లేడేట్ ప్రదర్శిస్తుంది.

వీటితో పాటుగా అత్యంత ప్రాచుర్యం పొందిన మార్వెల్ మూవీ సెలక్షన్, అత్యుత్తమ యాక్షన్ బ్లాక్‌బస్టర్స్ ను యాక్షన్ ఎట్ 9తో వీక్షించవచ్చు. వీక్షకులు అత్యుత్తమ ఇంగ్లీష్ వినోదాన్ని అమెరికన్ ఐడెల్, కాఫీ విత్ కరణ్, మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియాలో అత్యుత్తమ ఎపిసోడ్స్ చూడవచ్చు.

కిడ్స్ నెట్ వర్క్ పై కొత్త కంటెంట్

కిడ్స్ నెట్‌వర్క్‌పై 100 గంటలకు పైగా తాజా కంటెంట్‌ను జోడించారు. డిస్నీ ఛానెల్, హంగామా టీవీ లపై సమ్మర్ బొనాంజాను వీక్షించవచ్చు. వీటిలో దేశీయంగా తీర్చిదిద్దిన బాపు – తెలివైన నాయకుని కథ ; దీనితో పాటుగా సంతోషకరమైన సర్కస్ ట్రూప్‌లోని స్నేహితులతో కూడిన జంతువుల కథ -గుడ్డు, సృజనాత్మక గాడ్జెట్స్‌తో కూడిన సాఫ్ట్ టాయ్ – గాడ్జెట్ గురు విత్ గణేశాఆ వంటివి వీక్షించవచ్చు.

చిన్నారులు వీటితో పాటుగా హగేమారు షోను సైతం వీక్షించవచ్చు. వీటితో పాటుగా సెల్ఫీ విత్ భజరంగ్, డోరెమాన్, చాచా చౌదరి, మిరాక్యులస్‌లో నూతన ఎపిసోడ్స్‌ను సైతం వీక్షించవచ్చు. క్రీడాభిమానులు ఇప్పడు క్రికెట్ కనెక్టడ్‌ను ఆస్వాదించవచ్చు.

మెదడుకు మేత ఇంటరాక్టీవ్ గేమ్స్

దీనిలో క్రికెట్ లెజండ్స్ తమ అభిమానులతో వీడియో కాల్స్ ద్వారా ప్రతి వారమూ మాట్లాడవచ్చు. అలాగే ఐపీఎల్‌లో అత్యుత్తమ మ్యాచ్‌లు సైతం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌పై చూడవచ్చు. ఇంటరాక్టివ్ గేమ్స్‌తో తమ మెదడుకు వ్యాయామాన్ని అందించడంతో పాటుగా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్‌పై వచ్చే బ్రెయిన్ బూస్టర్స్‌తో ప్రయోగాలూ చేయవచ్చు.

అలాగే నూతన షో లాక్‌డౌన్  ఇండియాస్ ఫైట్ ఎగైనెస్ట్ కరోనా వైరస్ ద్వారా అత్యంత భయంకరమైన వైరస్‌పై భారతదేశపు పోరాటాన్ని చూడవచ్చు. ఓ నెట్‌వర్క్‌గా స్టార్ టీవీ, భావోద్వేగ పరంగా కోట్లాది మంది భారతీయులను 25 సంవత్సరాలుగా కనెక్ట్ అయింది. ఈ కష్టకాలంలో తమ పూర్తి మద్దతును అందించడాన్ని కొనసాగిస్తుంది.

Related posts

లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి సహకరించండి

Satyam NEWS

మంత్రి బొత్స కొడుకు పెళ్లి విందు…300 మందితో పోలీసు బందోబ‌స్తు…!

Satyam NEWS

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న #GoodMorningCMSir

Satyam NEWS

Leave a Comment