30.3 C
Hyderabad
March 15, 2025 10: 40 AM
Slider నిజామాబాద్

ఉపాధి కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

Suresh Gonda

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీలను ఆదుకుని ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సిఐటి నాయకులు సురేష్ గొండ అన్నారు. ఆయన  సత్యం న్యూస్ తో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు కరొనావైరస్19 వలన వ్యవసాయ కూలీలు పేద రైతులు కార్మికులకు ఎలాంటి  పనులు లేక వారి కుటుంబాలు దిన స్థితికి చేరాయని వారి జీవితాలు దినదిన  గండంగా మారాయని అన్నారు.

వివిధ రంగాల పేదవాళ్లకు ప్రభుత్వం తక్షణమే ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు సహాయం అందించలని  కేరళప్రభుత్వం లాగా  17 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని సిఐటియు జుక్కల్ నియోజకవర్గ కన్వీనర్ సురేష్ గొండ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి.

కాని ప్రస్తుత నెలలో ఉపాధిహామీ పనులు కొనసాగించడం వల్ల సామాజిక దూరాన్ని పాటించడం సాధ్యం కానందున ప్రభుత్వం తక్షణమే తక్షణమే ఆలోచన చేసి ప్రస్తుతం కొనసాగుతున్న ఉపాధి పనులను నిలిపి వేసిందని ఆయన అన్నారు.

గ్రామాల్లో  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కల్గి ఉన్న ప్రతి కూలికి ప్రతిరోజు రెండు వందల రూపాయలు చెల్లిస్తూ వీరికి మే 7 వరకులాక్ డౌన్ కారణంగా ఉపాధి హామీ పనులు నిలిపివేసినందున కూలీలకు ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోవిద్ 19 వైరస్ కు దూరంగా ఉండేవిధంగా ప్రతి ఒక్కరు సహకరిస్తూ సామాజిక దూరం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts

ఫాక్ట్ ఫైండింగ్: తమిళనాడుతో ‘కియా’ చర్చలు నిజమే

Satyam NEWS

రాయలసీమ లిఫ్ట్ పనులను వెంటనే నిలిపివేయాలి

Satyam NEWS

వడగాలులతో అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS

Leave a Comment