Slider ఆదిలాబాద్

నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యం కొనుగోలు చేయాలి

A Bhaskar rao

నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని  జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు ఏఈఓ , ఎవో లను ఆదేశించారు. బుధవారం  అదనపు కలెక్టర్ చాంబర్ లో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ, సహకార శాఖ, డీసీఎంఎస్ అధికారులతో నిర్వహించిన జిల్లా సేకరణ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  2019 – 20 రబీ సీజన్ లో 2 లక్షల41 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, ధాన్యం సేకరణ కోసం 204 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు తగినంత మౌలిక సదుపాయాలు, టార్పాలిన్, తేమ కొలుచు యంత్రాలు, వేయింగ్ మిషన్ లు, ప్యాడి క్లీనర్ లను సమకూర్చు వలసిందిగా అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ ను ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాలకు నాణ్యత ప్రమాణాలతో  ఉన్నా ధాన్యం తెచ్చేలా, ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలకు మాత్రమే ధాన్యం తీసుకెళ్లేలా రైతులకు తెలియజేసి తేదీల వారిగా టోకెన్లు ఇవ్వాలని తెలిపారు. వాటి ప్రకారం ధాన్యాన్ని వ్యవసాయ అధికారులు, ఏ ఈ ఓ లు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యం ఎప్పటికప్పుడు ట్యాబ్ లో నమోదు చేసి చెల్లింపులు జరిగేటట్లు చూడాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు.

ప్రస్తుతం జిల్లాలో 33 లక్షల గన్ని సంచులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి మురళీధర్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్,జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, పౌరసరఫరాల కార్పోరేషన్ మేనేజర్ శ్రీ కళ, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ , డిసిఎంఎస్ మేనేజర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రఘు స్వామి, డి పి యం తదితరులు పాల్గొన్నారు.

Related posts

గృహ వినియోగ వస్తువుల పంపిణీ తనిఖీ

mamatha

నియో cov వైరస్ పై అపోహలు నమ్మవద్దు

Satyam NEWS

ఫార్మర్ వెల్ఫేర్:సంఘటిత రైతాంగ పోరాటానికి సిద్ధం

Satyam NEWS

Leave a Comment