28.7 C
Hyderabad
April 27, 2024 03: 28 AM
Slider నెల్లూరు

నిత్యావసర వస్తువులు ధరలకు ఆదుపేలేదు

rates

వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలకు ఆదుపేలేదని అదేవిధంగా వాటిని అదుపు చేయవలసిన మంత్రి నోటికి హద్దే లేదని కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయములో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి  చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ప్రజలు పనులు లేక రాబడి లేక కుటుంబ జీవనం ఎలా సాగాలో తెలియక అయోమయ పరిస్థితులలో ఉన్న సమయములో మూలిగే నక్క పై తాటి కాయ పడినట్లు అడ్డు,అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల వలన కుటుంబాలు కుదేలు అవుతున్నవని,ఉప్పు,పప్పు కూడా కొనే పరిస్థితి లేదని,రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరిగి పోతున్నారాష్ట్ర ప్రభుత్వంలో కనీస స్పందన కూడా లేదని,గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ ధర పై ప్రతి కుటుంబానికి నెలకు రెండు కిలోల కంది పప్పు ఇవ్వగా ఈ ప్రభుత్వం దానిని కిలోకి తగ్గించారని అదేవిధంగా రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ను నియంత్రించాల్సిన పౌర సరఫరాల శాఖామంత్రి  కొడాలి నాని ఆపని వదిలేసి ప్రతిపక్ష పార్టీల ను తిట్టడమే పని గా పెట్టుకున్నారని అందువలన ప్రభుత్వ నియంత్రణ లేక వ్యాపారులు కుత్రిమ కొరత సృష్టించి సరుకుల ధరలను విపరీతంగా పెంచుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం.ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఏలూరు క్రిష్ణయ్య, దారా విజయబాబు, శివుని రమణారెడ్డి, ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి, బుధవరపు శివకుమార్, గొర్రిపాటి నరసింహ, కలువాయి చెన్నకృష్ణా రెడ్డి, ఉయ్యురు వేణు, బత్తుల రమేష్, అగ్గి మురళి, పులా వెంకటేశ్వర్లు, సోమవరపు సుబ్బారెడ్డి గరికిపాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వెయిటింగ్:భారత్ పర్యటనకై ట్రంప్ ఆసక్తి

Satyam NEWS

సర్పంచ్ భర్త నుంచి నన్ను కాపాడండి

Satyam NEWS

‘భవిష్యత్‌కు గ్యారంటీ’ పేరుతో టీడీపీ మేనిఫెస్టో

Satyam NEWS

Leave a Comment