38.2 C
Hyderabad
April 29, 2024 13: 23 PM
Slider విజయనగరం

కేసుల శాశ్వతంగా కేసుల‌ పరిష్క‌రానికి లోక్ అదాల‌త్

#Lokadalath

కేసుల శాశ్వత పరిష్కారమే లోక్ అదాలత్ ధ్యేయమని విజ‌య‌న‌గ‌రం  జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జి.గోపి అన్నారు. జిల్లా వ్యాప్తంగా జ‌రిగిన‌ లోక్ అదాలత్ లో రాజీమార్గం ద్వారా సివిల్, క్రిమినల్ తదితర మొత్తం 397 కేసులు పరిష్కారానికి వచ్చాయని తెలిపారు.

వర్చువల్ విధానంలో పార్వతీపురం, బొబ్బిలి, ఎస్.కోట, కొత్తవలస, చీపురుపల్లి, గజపతినగరం, కురుపాం కోర్టులలో లోక్ అదాలత్ నిర్వహించినట్లు వివరించారు. లోక్ అదాలత్ లో పరిష్కరించే కేసుల్లో ఇరుపార్టీల గెలుపు సాధ్యమని, ఆర్జీదారుల డబ్బు, సమయం ఆదా అవుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి  వి.లక్ష్మీ రాజ్యం, జిల్లా ఫ్యామిలీ కోర్టు మరియు మూడో అదనపు జిల్లా జడ్జి ఎం.మాధురి, సీనియర్ సివిల్ జడ్జి జె.శ్రీనివాసరావు, ఎక్సైజ్ మేజిస్ట్రేట్ బి.వి.విజయలక్ష్మి, అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.శిరీష తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహిళా సంఘం భవన నిర్మాణానికి మంత్రి హరీశ్‌ రావు భూమి పూజ

Satyam NEWS

టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: కటకటాల్లోకి విలేకరి, అతని స్నేహితులు

Satyam NEWS

Leave a Comment