36.2 C
Hyderabad
April 27, 2024 21: 29 PM
Slider కర్నూలు

నీటి ప్రాజెక్టుల్లో రాయలసీమకు తీరని అన్యాయం

#rayalaseema

రాయలసీమ లో నీటి ప్రాజెక్టు విషయంలో అన్యాయం జరుగుతుందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. రాయలసీమ కర్తవ్వ దీక్ష పేరుతో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలు నగరంలోని ఎస్టిబిసి కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో రాయలసీమలోని ముఖ్య నేతలు జెసి దివాకర్ రెడ్డి, గంగుల ప్రతాపరెడ్డి, కాంగ్రెస్ నాయకులు డాక్టర్.శైలజనాథ్, తులసి రెడ్డి ప్రజా గాయకుడు గద్దర్ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు పాల్గొని రాయలసీమకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.

కర్ణాటక ప్రాంతంలో అప్పర్ భద్ర ప్రాజెక్టును  అడ్డుకోకపోతే రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నేతలు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో ఉన్న నీరు మాత్రం   క్రింది ప్రాంతాలకు వెళ్ళిపోతుందని తెలిపారు. కృష్ణా నదిపై తీగల వంత నిర్మిస్తున్నారని తీగల వంతెనతోపాటు బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని వారు డిమాండ్ చేశారు. కృష్ణ నదీ పై బిర్జ్ నిర్మిస్తే తెలంగాణ రాయలసీమ ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుందని వారు తెలిపారు.

భవిష్యత్తులో రాయలసీమ లోని నాలుగు జిల్లాల తో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలుపుకొని ప్రత్యేక రాష్ట్రం గా గ్రేటర్ రాయలసీమ  కోసం కృషి చేస్తామని మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి తెలిపారు. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ  రాయలసీయ ను తెలంగాణ లో కలిపి రాయల తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే మంచిదన్నారు.   వేసవికాలం అనంతరం ముఖ్య నేతలను కలుసుకొని రాయలతెలంగాణ కోసం కృషి చేస్తానని  తెలిపారు.

Related posts

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

Satyam NEWS

త్వరలో తండ్రి కాబోతున్న భల్లాల దేవుడు

Satyam NEWS

అయోమయంలో పడిపోయిన అమరావతి ఉద్యోగులు

Satyam NEWS

Leave a Comment