33.7 C
Hyderabad
April 30, 2024 02: 52 AM
Slider ముఖ్యంశాలు

మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్

#government medical colleges

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నూతనంగా మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కాలేజీలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో ఈ నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు.

వచ్చే ఏడాది నుంచి ఒక్కో కాలేజీ వంద ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోబోతున్నది.ప్రభుత్వ తాజా నిర్ణయంతో తెలంగాణలో మెడికల్ సీట్ల సంఖ్య 10 వేలకు చేరువ కానున్నాయి.అంతేకాకుండా ఈ ఎనిమిది కాలేజీలు అందుబాటులోకి వస్తే జిల్లాకో మెడికల్ కాలేజ్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించనుంది.

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదేళ్లలో 29 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని మంత్రి హరీష్ రావు తెలిపారు. తాజాగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో సీఎం కేసీఆర్‌కు వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

తిరుగుప్రయాణమైన మహారాష్ట్ర కూలీలకు పోలీసుల అడ్డు

Satyam NEWS

కేంద్ర మాజీ మంత్రి అశోక్ ఇంటి వద్ద టెన్షన్… టెన్షన్…

Satyam NEWS

పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాలను దిగ్భంధిస్తాం: ఎమ్మెల్యే చిరుమర్తి

Satyam NEWS

Leave a Comment