26.7 C
Hyderabad
May 3, 2024 07: 04 AM
Slider ముఖ్యంశాలు

మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

#school teachers

మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 5వ తేదీ నుంచి ట్రాన్స్ ఫర్ కౌన్సెలింగ్ షురూ కానుంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీచేశారు. మోడల్ స్కూల్ టీచర్లుగా నియామకమైన అనంతరం జరుగుతున్న తొలి ట్రాన్స్ ఫర్ ఇదే కావడం గమనార్హం.

దాదాపు పదేండ్ల నిరీక్షణకు ప్రభుత్వం తెరదించింది. ట్రాన్స్ ఫర్ దరఖాస్తు సమర్పణ ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రొవిజినల్ ఎన్ టైటిల్ మెంట్ పాయింట్స్ లిస్ట్ ఈనెల 14వ తతేదీన వెలువడనుంది. ఫైనల్ ఎన్ టైటిల్ మెంట్ లిస్ట్ ఈనెల 16, 17 తేదీల్లో సాగనుంది. వెబ్ ఆప్షన్ల సమర్పణ 18, 19 తేదీల్లో ఉంటుంది. బదిలీల ఉత్తర్వులు 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అందనున్నాయి.

కాగా ట్రాన్స్ ఫర్ ఆర్డర్లలకు సంబంధించిన సమస్యలపై అప్పీళ్లకు ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన వివరాలకు http://schoo;edu.telangana.gov.in వెబ్ సెట్ పరిశీలించాలని సూచించారు. ఇదిలా ఉండగా బదిలీలకు సంబంధించి పలు గైడ్ లైన్స్ కూడా పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మోడల్ స్కూల్ టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదలపై యూటీఎఫ్ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ఈ బదిలీల ప్రక్రియను ఎలాంటి అవాంతరాలు లేకుండా పారదర్శకంగా చేపట్టాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తగా 194 మోడల్ స్కూళ్లలో 3000 మంది టీచర్స్ పనిచేస్తున్నారు. 2013, 2014లో వీరు రిక్రూట్ అయ్యారు. అయితే నియామకమైన నాటి నుంచి ఇప్పటి వరకు అదే స్థానంలో కొనసాగుతూ వచ్చారు. కాగా బదిలీలు చేయాలని 3, 4 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ట్రాన్స్ ఫర్లకు సంబంధిదంచిన అంశం కోర్టులో ఉన్న నేపథ్యంలో వీరికి నూతన జోన్ల ప్రకారం కేడర్ విభజన జరగలేదు. దీంతో పాత జోన్ల ప్రకారం ప్రభుత్వం వీరిని బదిలీలు చేయాలని నిర్ణయించింది. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి ఆమోదం పొందిన తరువాత షెడ్యూలు విడుదల చేశారు.

Related posts

న్యూ రూల్: కామారెడ్డిలో కొలువుదీరిన నూతన పాలకవర్గం

Satyam NEWS

మార్కెట్ యార్డ్ తనిఖీ చేసిన రాజంపేట ఎమ్మెల్యే

Satyam NEWS

చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

Satyam NEWS

Leave a Comment