31.2 C
Hyderabad
May 3, 2024 01: 29 AM
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా కు అన్యాయం జరగబోతోంది పారా హుషార్

#TDP Srikakulam

పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న శ్రీకాకుళం జిల్లా కు తీరని అన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పి చంద్రపతి రావు అన్నారు. ఏ ఐ సిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి ఎజ్రా  అరసవల్లి  తో కలిసి మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, మాజీ శాసన సభ్యురాలు గుండా లక్ష్మి దేవిని కలిసి సమస్యపై చర్చించారు.

పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తే విజయనగరం పార్లమెంట్ నియోజక వర్గంలో ఉన్న శ్రీకాకుళం జిల్లా ప్రాంతాలై ఎచ్చర్ల, రాజాం , పాలకొండ నియోజక వర్గాలు విడిపోతాయని ఆయన అన్నారు. దీనివల్ల శ్రీకాకుళం జిల్లా లో ని పారిశ్రామిక వాడలు, పలు విద్య సంస్థలు మరో జిల్లాకు తరలివెళ్లి శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టం కలుగుతుందని తెలియజేశారు.

ఎచ్చర్ల మండలం శ్రీకాకుళం నగరంలో అంతర్బాగం, శ్రీకాకుళం పట్టణం లో గల 30 శాతం భూభాగం పిఎన్ కొలని, గుజరాతి పేట, విజయనగరం జిల్లాలో కలిసి పోతే శ్రీకాకుళం జిల్లా 70 సంవత్సరాలు వెనుకబడిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

టిడిపి జిల్లా అధ్యక్షురాలు గౌతీ శిరీష పి ఎం కోలనీలో ఒక ప్రయివేట్ కార్యక్రమానికి రాగా ఆమెకు కూడా ఈ సమస్యపై పోరాటం చేయాలని వినతి పత్రం సమర్పించారు. పలాస, సోంపేట, ఉద్దానం ప్రాంతాలు సామాజికంగా, ఆర్ధికంగా, విద్యా పరంగా చాల వెనుకబడి ఉన్నాయని ఆయన అన్నారు.

ఎచ్చర్ల మండలం విజయనగరం జిల్లాలో కలిపితే 80 శాతం సముద్ర తీర ప్రాంతం శ్రీకాకుళం జిల్లా నుండి పోతుందని తెలిపారు. సి పి ఎం ప్రధాన కార్యదర్శి బైరి కృష్ణ మూర్తిని కలిసి ఆయనకు కూడా వినతి పత్రం ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా అటవీ సంపద అరకు పార్లమెంట్లో కి పోతున్నదని శ్రీకాకుళం జిల్లాకు కనీసం ఆటవి సంపద కూడా లేకుండా  పోతుందని వారు అన్నారు.

Related posts

కోడెల ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్

Satyam NEWS

ఆదర్శ కమ్యూనిస్టు నేత దివంగ‌త‌ కామ్రేడ్ మొకర అప్పారావు

Satyam NEWS

ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం వారి కంచన ఫౌండేషన్

Satyam NEWS

Leave a Comment