29.7 C
Hyderabad
April 29, 2024 08: 27 AM
Slider ఖమ్మం

ప్రశాంతంగా గ్రూప్ -1 పరీక్ష

#collector

గ్రూప్-1 ప్రిలిమినరి పరీక్ష భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  ప్రశాంతంగా జరిగినట్లు  జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.  పరీక్ష నిర్వహణకు  23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 23 పరీక్షా కేంద్రాల్లో  8851 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 6611 మంది హాజరయ్యారని, 2240 మంది గైర్హాజరయినట్లు చెప్పారు.  మొత్తం 74.69 శాతం ఉన్నట్లు చెప్పారు. టీఎస్ పిఎస్సీ మార్గదర్శకాల మేరకు అభ్యర్థులు పరీక్షా రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 

ఈ సందర్భంగా  మెటీరియల్ పంపిణిని ఎస్పీ డా వినీత్ తో కల్సి పరిశీలించారు.  అనంతరం లక్ష్మీ దేవిపల్లి మండలంలోని ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల, పాల్వంచ లోని డి.ఏ.వి.పాఠశాలలో పరీక్ష నిర్వహణ తీరును తనిఖీ చేశారు. ప్రతిష్టాత్మక పరీక్ష నిర్వహణలో విధులు నిర్వహించిన సిబ్బంది ఎలాంటి పొరపాట్లుకు తావు లేకుండా నిష్పక్షపాతంగా, పకడ్బందీగా నిర్వహించారని అభినందించారు.  పరీక్షా కేంద్రాలలో సిసి టివిలను  పరిశీలించారు.  అంతకు ముందు రిసిప్షన్ కేంద్రంలో  కోడింగ్ ను,    బాక్సులను పరిశీలించారు. పరీక్షా కేంద్రాలు అభ్యర్థులు సులభంగా తెలుసుకోవడానికి రూట్ మ్యాపులు, హెల్ప్ డెస్క్ లు, బస్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు చెప్పారు

Related posts

ప్రైవేట్ బ‌స్సుల‌కు ప్ర‌తినెల కోట్లు చెల్లింపులు..

Satyam NEWS

ఎమ్మెల్సీ ఎన్నికలకు పట్టభద్రులందరూ ఓట్లు నమోదు చేసుకోవాలి

Satyam NEWS

అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి : డిఐజి రంగనాధ్

Satyam NEWS

Leave a Comment