29.7 C
Hyderabad
April 29, 2024 08: 53 AM
Slider నల్గొండ

నేతలకు తెలియకుండా నామినషన్లు

#munugodu

తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు జాతీయ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నికకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, అధికార టీఆర్ఎస్ పార్టీలకు ఈ ఉప ఎన్నిక ఎంతో మైలేజ్ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో మునుగోడులో ప్రచారాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీలలోకి  జంపింగ్ లు  ఎక్కువ అయ్యాయి. టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య ఆ పార్టీని వీడరు. అలాగే అనేక మంది మండల, గ్రామ స్థాయి నేతలు పార్టీలు మారుతూనే వున్నారు. ఐతే టి‌ఆర్‌ఎస్ కు మాత్రం అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. నామినషన్ల పర్వం ముగిసినా ఆ పార్టీ కి సమస్యలు పోవటంలేదు. మునుగోడు ఉప ఎన్నికలో కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షురాలు, మండల ప్రధాన కార్యదర్శి మూదాం స్వప్న పార్టీ నేతలకు తెలియకుండా నామినేషన్ దాఖలు వేసిన విషయం బయటకు వచ్చింది. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజున వారు  ఇండిపెండెంట్ అభ్యర్ధులుగా నామినషన్ లు వేసిన విషయం తాజాగా బయటకు పొక్కటంతో టి‌ఆర్‌ఎస్ నేతలు అవాక్కయ్యరు. వారిని ఉపసంహరింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారు అందు బాటులోకి రాకపోవటంతో ఉత్కంట నెలకొన్నది.  రాష్ట్ర పార్టీ నేతకు వారి బాధ్యత అప్పగించి వారి నామినేషన్ లు ఉపసంహరణ జరగాలని టి‌ఆర్‌ఎస్ అగ్రనేతలు ఆదేశించినట్లు సమాచారం.

Related posts

జగన్ ‘‘కలెక్షన్ వసూలు’’ విధివిధానాలపై మెగాస్టార్ ఫస్ట్ రియాక్షన్ ఇది

Satyam NEWS

ఎమ్మెల్యే ప్రసన్న మంత్రి కావాలి

Bhavani

ఒక వేణువు ఆగింది

Satyam NEWS

Leave a Comment