33.7 C
Hyderabad
April 29, 2024 00: 34 AM
Slider శ్రీకాకుళం

బాధితుల కుటుంబాలకు ఐడీ నెంబర్లు కేటాయించండి

#srikakulam

డీఎస్సీ 2002 బాధిత హిందీ పండితుల్లో జీతాలు రాకముందే మరణించిన  వారి కుటుంబాలకు లబ్ధిదారుల ఐ. డి.  కేటాయించి 23 నెలల జీతాల చెల్లింపునకు ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పిసిని వసంతరావు, సహాధ్యక్షుడు కుప్పన్నగారి శ్రీనివాసరావులు,ప్రధాన కార్యదర్శి కూన రంగ నాయకులు, ఎన్.రత్నాకర్ లు ఖజానాశాఖాధికారి సిహెచ్.రవికుమార్ ను కోరారు. ఈ మేరకు వారు ఆయనకు వినతిపత్రం అందించారు. 46 నెలలుగా జీతాలు రాని 39 మంది హిందీ పండితుల్లో 37 మందికి ట్రెజరీ ఐ.డీలు జారీ అయినా.. విధుల్లో మరణించిన బత్తిని రమణయ్య, జి.శ్యామలరావు కుటుంబాలకు మాత్రం ఐ.డీలు కేటాయింపు జరగలేదని డీడీ దృష్టికి తెచ్చారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.తిరుమల చైతన్య కూడా తగు ప్రతిపాదనలు పంపారని గుర్తు చేశారు. తక్షణమే ఐ.డీ నంబర్లు కేటాయించి 23 నెలల జీతాలను చెల్లింపు చేయాలని కోరారు.

Related posts

ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీ: నలుగురికి గాయాలు

Bhavani

ఘనంగా హోలీ సంబురాలు

Murali Krishna

ఎస్ సి మహిళలు  ఉచిత కుట్టు మిషన్ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment