31.2 C
Hyderabad
May 3, 2024 00: 00 AM
Slider ముఖ్యంశాలు

చుక్కలను చూపిస్తున్న పసుపు, కుంకుమ ధరలు…

#vijayanagarammarket

“సత్యం న్యూస్. నెట్” పరిశోధనలో వెలుగు చూసిన ఘోరం…!

పండగొస్తే…బాగా లాభపడేది వ్యాపారస్థుడే.మార్కెట్ లో ధరల బేరీజు తో…వచ్చిన వినియోగదారుడిని తన షాప్ వైపు అలాగే తాను అమ్మే వస్తులను ఆకర్షించే విధంగా ధరలను నిర్ణయించడం వ్యాపారస్థుని ప్రధమ కర్తవ్యం. కానీ ఈ నీతివంతమైన మాటలను ప్రస్తుత వ్యాపారస్థులు ఎప్పుడో పక్కన పెట్టేశారు. అసలు వస్తువు పై ధర ను పొల్చుకోకుండా…మార్కెట్ లో ధరలపై కనీస అవగాహన లేకుండా మార్కెట్ లోకి వెళితే.. జేబు కాదు కదా…ఆన్ లైన్ పేమెంట్ లో కూడా   అంతే వేగవంతం గా ఆకాశాన ఉన్న చుక్కలను చూపించేస్తున్నారు..వ్యాపారస్థులు.

ఈ విషయాన్ని తన వద్ద కు వచ్చిన సమాచారం తో “సత్యం న్యూస్. నెట్” విజయనగరం పీడబ్ల్యూ(ప్రీన్స్ ఆఫ్ వీల్స్) మార్కెట్ లో అదీ పేరు న్న షాప్ లలో కొనుగోలు చేస్తే అసలు రంగు బయటపడింది. ఈ భోగీ, సంక్రాంతి పండుగ లలో ప్రతీ ఇంట…పసుపు, కుంకుమ వినియోగం తప్పనిసరి. దాన్ని క్యాష్ చేసుకుందామని వాటిని విక్రయించే హోల్ సేల్ షాప్ లతో పాటు.. ఆయుర్వేదం అమ్మే “వానపాము” పేరుతో ఉ న్న  షాప్ లలో ఓ షాప్ ధరలు పండగ పుణ్యమా ఆకాశాన్నంటాయి.కిలో పసుపు ధర…150 ఉండగా…600 లకు అమ్మడం…అంతే ధర ఉందని వినియోగదారుడు కొనడం అంతా శరవేగంగా జరిగిపోయింది.

తీరా మిగిలిన అదే “వానపాము”..పేరు తో మరో షాప్ లో సంప్రదించగా దిమ్మతిరిగే ధర కు అమ్మారని తెలుసుకున్నారు. అలాగే విజయనగరం లోని గంటస్థంభం వద్దే పావుకిలో కేవలం 45 రూపాయల కు అమ్ముతుండటంతో సదరు పేరు ఉన్న షాప్ నిర్ణీత ధరల కన్నా..అత్యదికంగా అమ్ముతుండటంతో… సేల్స్ ట్యాక్స్ శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారా..? లేక పండగ పూటని వదిలేసారాన్న..ఆ శాఖ చెప్పాలని అంటోంది”సత్యం న్యూస్. నెట్”.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

అంబర్ పేట్ లో గోపీనాథ్ ముండే జయంతి

Satyam NEWS

బేతపూడిలో రైతులు రైతుకూలీలు నిరసన

Sub Editor

పేపర్ లికేజీ దొంగలను కాపాడే ప్రయత్నం: మాజీ మంత్రి షబ్బీర్ అలీ

Satyam NEWS

Leave a Comment