38.2 C
Hyderabad
April 29, 2024 14: 33 PM
Slider జాతీయం

ఆక్సిజన్ ఉత్పత్తిపై గురుగ్రామ్ కొత్త ప్రయోగం

#oxygen plant

కరోనా సమయంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న ఈ పరిస్థితుల్లో ఢిల్లీ సరిహద్దుల్లోని హర్యానా రాష్ట్రానికి చెందిన గురుగ్రామ్ లో కొత్త నిబంధన అమలు చేస్తున్నారు. ఢిల్లీ లోనూ పరిసర ప్రాంతాలలోనూ ఎక్కడా ఆక్సిజన్ దొరకని పరిస్థితి ఉంది. పెద్ద ఆసుపత్రులకే ఆక్సిజన్ దొరక్కపోవడంతో చిన్న ఆసుపత్రుల్లోని రోగులు ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వెంటిలేటర్ బెడ్లు ఉన్న ఆసుప్రతులు కూడా కరోనా రోగులకు సేవలు అందించాలంటే సాధ్యం కావడం లేదు. ఈ స్థితి నుంచి గట్టెక్కేందుకు గురుగ్రామ్ పాలనా విభాగం కీలక నిర్ణయం తీసుకున్నది. 50 పడకల ఆసుపత్రులన్నీ సొంతంగా ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేసుకోవడానికి వీలుకల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తక్షణం ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని గురుగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. సొంతగా ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టుకోవడానికి ఇప్పటి వరకూ చిన్న ఆసుపత్రులకు అనుమతి లేదు. పిఎస్ఏ ( ప్రజర్ స్వింగ్ అడ్సాబ్షన్) పద్ధతిలో కూడా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవడానికి వీలు కల్పించారు. ఇదే పద్ధతి దేశంలోని అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తే రాబోయే రోజుల్లో అయినా పరిస్థితి మారే అవకాశం కనిపిస్తున్నది.

Related posts

‘సాటిలేని సహకారం’ పై చర్చకు సిద్ధం

Bhavani

ఏజెన్సీలో విజయవంతంగా నడుస్తున్న ఆదివాసీల బంద్

Satyam NEWS

కఠిన చర్యలు తీసుకోకుంటే.. మూడో వేవ్

Sub Editor

Leave a Comment