35.2 C
Hyderabad
April 27, 2024 11: 14 AM
Slider సినిమా

అందాల అనిత సాంగ్ రిలీజ్

#andalaanita

అందాల అనిత సాంగ్ రిలీజ్ ఫంక్షన్ ఫిలిం ఛాంబర్ లో ఉత్సాహంగా జరిగింది. రచయిత, సింగర్ నాగరాజు 14 ఏళ్ల క్రితం విడుదల చేసిన అనిత ఓ అనిత పాటకు సీక్వెల్ గా ఈ సాంగ్ ను నిర్మించారు.  యువత గుండెలని పిండేలా రూపొందించిన ఈ సాంగ్ లో నటీనటులుగా కోటేంద్ర సోనియా నటించారు. సాంగ్ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిథులుగా మ్యూజిక్ డైరెక్టర్ నటుడు ఆర్ పి పట్నాయక్, నిర్మాత రాజ్ కందుకూరి,  మెట్రో టీవీ సిఎండి జయ ప్రసాద్, నిర్మాత రామ సత్యనారాయణ లు హాజరై రిలీజ్ చేశారు. యువత గుండెలను పిండేసేలా పాటను పాడటంతో పాటు అద్భుతంగా నటించారని అభినందించారు.

రచయితలు సంగీత దర్శకులు తప్పనిసరిగా ఐపిఆర్ఎస్ లో సభ్యత్వం తీసుకోవాలని సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ విజ్ఞప్తి చేశారు. ఎంతో వేయ ప్రయాసలు కూర్చి నిర్మించిన పాటలను ఆన్లైన్లో పెట్టడం ద్వారా వారికి రావాల్సిన పారితోషకం అందుకోలేకపోతున్నారని అన్నారు. ఈ రంగంపై ఆసక్తితో ప్రవేశించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇలాంటి వి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్క రచయిత సింగర్ కు చేరవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts

తిరుమల శ్రీవారి పుష్కరిణి లో స్నానం చేయడం కుదరదు

Satyam NEWS

జీడిపప్పు పరిశ్రమలతో కాలుష్య నియంత్రణ అధికారుల కుమ్మక్కు

Satyam NEWS

మద్యం షాపుల్ని మహిళలు వ్యతిరేకించడం లేదు

Satyam NEWS

Leave a Comment