42.2 C
Hyderabad
May 3, 2024 18: 35 PM
Slider ముఖ్యంశాలు

మనకు కొత్తేమీ కాదు కష్టాలు సహించడం నష్టాలు భరించడం

old city

కలరా, మశూచి, ప్లేగు, ఎయిడ్స్ ….లెక్కకు మించిన  మహమ్మారుల్ని ధైర్యం గా  ఎదుర్కొన్నాం. అంతెందుకు  రవి అస్తమించని బ్రిటీష్ దొరల దౌర్జన్యాలను పారద్రోలేందుకు వందల సంవత్సరాలు పోరాడాం. చివరకు స్వరాజ్యా న్ని  సాధించుకున్నాం…

ఆ త్యాగనిరతి  మనదేశం రక్తంలోనే ఉంది….అదే స్ఫూర్తి తో కరోనా మాయ రోగాన్నీ  జయిస్తాం భారతీయుల ఐక్యత ను మరోసారి ప్రపంచానికి చాటుతాం… కాలచక్రంలో రోజులు దొర్లుతున్నాయి. ప్రతి సారీ మరో రోజు ఉదయిస్తూనే ఉంది. ఉదయిస్తూనే ఉంటుంది..

మీ వంటి గొప్ప మనిషికి ప్రతి ఉదయం స్వాగతం పలుకుతోంది… మీరు చదివింది నిజంగా నిజం… మీరు ఎంతో కొంతయినా గొప్పవారు కనుకనే మీ వంటి అమ్మ /నాన్న/అన్న/అక్క/తమ్ముడు/చెల్లి/కొడుకు/కూతురు ప్రతి కుటుంబంలో ఉండాలి అనిపిస్తుంది….

ఎందుకంటే  మీరు బాధ్యతగా ఉంటారు… విలువల్ని గౌరవిస్తారు…అత్యున్నతంగా ఆలోచిస్తారు…ఇతరులకు ఆదర్శంగా ఉంటారు…అన్నిటికీ మించి మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ అందరికీ ప్రేమ ను పంచుతారు…అందుకే మీరు ఇంతలా ఎదిగారు…

ఎదుగుతూనే ఉంటారు… ఎదగాలి కూడా… అదే కదా మనిషి  జీవితానికి నిజమైన అర్ధం……ఈ కరోనా మిమ్మల్ని ఏమీ చేయలేదు. కట్టుబాటు పాటించండి అంతే. మళ్లీ భారతీయ సాంప్రదాయాలను మనవిగా చేసుకుందాం. ఇంతకాలం చాదస్తంగా కొట్టి పారేసిన పాత చింతకాయ పచ్చడి లాంటి ఆ సాంప్రదాయాలే ప్రాణాలను నిలబెడతాయి.

మే 3 వరకూ ప్రభుత్వం విధించిన ఆంక్షలు అమలులో ఉంటాయి. ఆ తర్వాత కూడా మనం ఇంతే జాగ్రత్తగా ఉండాలి. కాళ్లూ చేతులూ కడుక్కోనిదే ఏ పనీ చేయని సంస్కారమే మనకు రక్ష. నమస్కారం.

కృష్ణారావు (ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి)

Related posts

అందుబాటులోకి యాస్ తుఫాను కంట్రోల్ రూమ్

Satyam NEWS

కరోనా నుంచి కోలుకున్న పాకిస్తాన్ శతాధిక వృద్ధుడు

Satyam NEWS

కళ్యాణలక్ష్మి, షాది ముబారాక్, సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

Satyam NEWS

1 comment

Sanjai Prasad April 17, 2020 at 8:11 PM

Yes Sir, truly said. We were fighters and we are fighters and will be fighters…. We will definitely get rid of this virus very soon hopefully.

Reply

Leave a Comment