40.2 C
Hyderabad
April 26, 2024 13: 08 PM
Slider ప్రపంచం

కరోనా నుంచి కోలుకున్న పాకిస్తాన్ శతాధిక వృద్ధుడు

#Corona Pakistan

పాకిస్తాన్ లో ఒక శతాధిక వృద్ధుడు కరోనా వైరస్ నుంచి బతికి బట్టకట్టాడు. 103 సంవత్సరాల వయసు ఉన్న అజీజ్ అబ్దుల్ అలీమ్ కు కరోనా సోకింది. దాంతో ఆయనకు చికిత్స అందించారు. ఆశ్చర్యంగా ఆయన కోలుకుని నేడు ఇంటికి చేరాడు. ప్రపంచం మొత్తంలో కరోనా నుంచి కోలుకున్న అతి పెద్ద వయసు వాడిగా అజీజ్ అబ్దుల్ అలీమ్ రికార్డు సృష్టించారు.

చైనా, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న చిత్రల్ జిల్లాకు చెందిన అలీమ్ 70 ఏళ్ల వరకూ కార్పెంటర్ గా పని చేశారు. ఆయనకు ముగ్గురు భార్యలు మరణించగా నాలుగో భార్య ఆయనను వదిలేసి వెళ్లింది. ప్రస్తుతం ఆయన ఐదో భార్యతో ఉంటున్నారు. ఆయనకు 9 మంది సంతానం. ఆయనకు  ఈ నెల ప్రారంభంలో కరోనా సోకింది.

ఆయనను వెంటనే ఐసోలేషన్ లోకి పంపి చికిత్స ప్రారంభించారు. ఆగా ఖాన్ హెల్త్ సర్వీస్ ఎమర్జెన్సీ సర్వీస్ కు చెందిన డాక్టర్ సర్దార్ నవాజ్ అలీమ్ కు చికిత్స అందివ్వడమే కాకుండా మానసికంగా ధైర్యాన్ని ఇచ్చారు. దాంతో ఆయన కోలుకుని ఇంటికి చేరుకున్నారు.

Related posts

ఎప్రీషియేషన్: ఉర్దూ కాలేజీ విద్యార్ధులకు ప్రశంసాపత్రాలు

Satyam NEWS

బాపట్లలో ఎన్.టి.ఆర్. పుస్తకాలపై సమాలోచన

Satyam NEWS

ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావం తెలిపిన కొలన్‌ శంకర్‌రెడ్డి

Satyam NEWS

Leave a Comment