33.7 C
Hyderabad
April 29, 2024 02: 12 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్ ను ముంచేసిన భారీ వర్షం

#HeavyRain

హైదరాబాద్ నగరం లోని చాలా ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతున్నది. పంజాగుట్ట ప్రాంతంలో అటు ఐదు కిలోమీటర్లు ఇటు ఐదు కిలోమీటర్ల దూరంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాలలో ట్రాఫిక్ స్తంభించింది.

అసిఫ్ నగర్ లో 7.1 సెంటిమిటర్లు, ఖైరతాబాద్ లో 5.5 సెంటిమిటర్లు, జూబ్లీహిల్స్ లో 4.9 సెంటిమిటర్లు, మెహదీపట్నం లో 3.4 సెంటిమీటర్లు, కార్వాన్ లో 3.3 సెంటిమిటర్లు, బేగంపెట్ లో 1.7 సెంటిమీటర్లు,

గోశామహల్ లో 1.3 సెంటిమిటర్లు, సికింద్రాబాద్ లో 1.1 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు అయింది. ఇంత పెద్ద వర్షం అతి తక్కువ సమయంలో కురవడంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి.

ఎక్కడా నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో నీరు రోడ్లపైనే నిలిచిపోయి ట్రాఫిక్ కు పూర్తి అంతరాయం కలిగింది. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ స్తంభించింది.

మెట్రో ట్రాక్ ల నుంచి కిందికి భారీ గా వర్షం నీరు రావడం మరింత ఇబ్బందిగా మారింది.

అండర్ గ్రౌండ్ లోకి వర్షం నీరు పంపకుండా ట్రాక్ మొత్తంలో కిందికి పైపులు వదిలిపెట్టిన మెట్రో రైలు యాజమాన్యం రోడ్డుపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు నరకం చూపిస్తున్నది.

Related posts

మైనార్టీ గురుకులాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం

Satyam NEWS

వాంటెడ్ జస్టిస్: సంక్షేమంలో దివ్యాంగుల వాటా ఏదీ?

Satyam NEWS

బీజేపీ ఇంతేనా… ఇక చాలునా?

Satyam NEWS

Leave a Comment