31.7 C
Hyderabad
May 2, 2024 08: 14 AM
Slider

మూడు రోజుల పాటు భారీ వర్షాలు

#Heavyrains

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోంది. ఇది రేపు ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 610 కి.మీ., చెన్నైకి 700 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిఉంది.

దీని ప్రభావంతో రేపటి నుంచి మూడు రోజులపాటు దక్షిణకోస్తాలోని ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

భారీ వర్షాల నేపధ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ద్వారా ఆరు జిల్లాల్లోని కోటిమందికి పైగా సబ్ స్ర్కైబర్లకి హెచ్చరిక సందేశాలు పంపినట్లు విపత్తుల సంస్థ తెలిపింది.

ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. సహాయక చర్యలకోసం 5-ఎన్డీఆర్ఎఫ్, 4-ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉంచారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ తెలిపింది.

Related posts

మూడ్రోజులపాటు తెలంగాణలో ప్రియాంక పర్యటన

Satyam NEWS

గిరగిరా తిరుగుతున్నదొనకొండ భూములు

Satyam NEWS

అభివృద్ధి పేరుతో కేంద్ర నిధులు దోచుకుంటున్న కాంట్రాక్టర్

Satyam NEWS

Leave a Comment