Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

గిరగిరా తిరుగుతున్నదొనకొండ భూములు

dkdrlystn

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి మారుతుందా? ఎవరి సంగతి ఏమో కానీ దొనకొండ ప్రాంత ప్రజలు మాత్రం ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు. శివరామ కృష్ణన్ కమిటి నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా దొనకొండ ప్రాంతం అయి ఉండాలి. అక్కడ విస్తారంగా ప్రభుత్వ భూములు, రాజధానికి అనువైన వాతావరణం ఉన్నాయి. అయితే చంద్రబాబునాయుడు మాత్రం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కన పెట్టి తనకు అనుకూలంగా ఉండే తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసుకున్నారు. దానికి అమరావతి అనే పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి గుంటూరుకు 32 కిలోమీటర్ల దూరంలో ఒరిజినల్ అమరావతి ఉంది. పంచారామ క్షేత్రాలలో ఒకటైన అమరలింగేశ్వరుడు ఉండే ఆలయం అది. పూర్వం ఆ ప్రాంతాన్ని ధన్యకటకం అని కూడా పిలిచేవారు. అయితే చంద్రబాబునాయుడు తుళ్లూరు ప్రాంతానికి అమరావతి అని పేరు పెట్టి ఒరిజినల్ అమరావతికి పేరు లేకుండా చేశారు. అమరావతి బౌద్ధులకు కూడా పవిత్ర క్షేత్రం. అక్కడ కాలచక్ర మహా సభలు కూడా జరిగాయి. అమరావతిపై ఎన్నో దాడులు జరిగినా అది అలా నిలబడి పోయింది కానీ చంద్రబాబు దాడితో దాని పేరుకూడా కోల్పోయింది. ఇప్పుడు కృష్ణా నదికి వరదలు వస్తే మునిగిపోయే ప్రాంతంగా చంద్రబాబు అమరావతి ఉందనే విషయాన్ని వై ఎస్ జగన్ ప్రభుత్వం బయటపెట్టడంతో రాజధాని అక్కడ నుంచి మారుతుందా అనే ప్రశ్న తలెత్తింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం చేయక ముందే అమరావతి మారుస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పుకార్లు లేపింది. తనకు పట్టు ఉన్న ప్రాంతాలలో రైతుల పేరిట కొందరు ధర్నాలు కూడా మొదలు పెట్టేలా చేసింది. ఇక్కడ ఇంత గొడవ జరుగుతుండగా దొనకొండలో మాత్రం భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దొనకొండలో నిన్నమొన్నటి వరకూ 3 లక్షల రూపాయలు ఎకరంగా ఉన్న భూమి ఇప్పుడు ఏకంగా 30 లక్షలకు చేరింది. అదే విధంగా రాష్ట్ర రహదాని ఆనుకున్నభూములైతే ఎకరం 60 నుంచి 70 లక్షలకు చేరుకున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా అక్కడ పెద్ద ఎత్తున ప్రారంభం అయ్యాయి. భూమి అమ్మకం కొనుగోలు ఇప్పటి వరకూ పెద్దగా నమోదు కాలేదు కానీ బేరసారాలు మాత్రం భారీగా జరుగుతున్నాయి. అక్కడ భూమి ఉన్న ఏ రైతును అడిగినా కూడా రాజధాని మారుతున్నది మా ప్రాంతానికి వచ్చేస్తున్నది అని నమ్మకంగా చెబుతున్నారు. రాజధాని మారుతుందని ఎవరు చెప్పారు అనే ప్రశ్నకు వారు ఆసక్తికరమైన సమాధానం చెబుతున్నారు. అమరావతి తాత్కాలిక రాజధాని అని చంద్రబాబే చెప్పినందున శాశ్వత రాజధానిగా దొనకొండను చేయడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. రాజధాని మారుతున్నదనే వారి నమ్మకం అక్కడ భూముల ధరలు చుక్కలను అంటేలా చేస్తున్నది.

Related posts

వైజాగ్ నుంచి వారణాసికి సూపర్ ఫాస్ట్ రైల్ కు సర్వే ప్రారంభం

Satyam NEWS

ములుగు బిజెపి ఆధ్వర్యంలో పండిత్ దీన దయాళ్ జయంతి

Satyam NEWS

రఘురామ వ్యవహారంలో లోక్ సభ స్పీకర్ జోక్యం చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment