Slider సినిమా

హీరో వరుణ్ తేజ్ కు కోర్టు నోటీసులు

varuntej

‘వాల్మీకి’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించగా, వరుణ్ తేజ్ హీరోగా నటించారు. సినిమాకు ‘వాల్మీకి’ టైటిల్ ను మార్చాలని కోరుతూ బోయ హక్కుల పోరాట సమితి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. ‘వాల్మీకి’ టైటిల్ బోయల మనో భావాలకు భంగం కలిగించేవిధంగా ఉందని బోయ నేతలు చెబుతున్నారు.ఈ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. హీరో వరుణ్ తేజ్ , సినిమా యూనిట్, తెలంగాణ డిజిపి, సెన్సార్ బోర్డు, ఫిలించాంబర్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో ఈ వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మాసం రోజులకు వాయిదా వేసింది. ‘వాల్మీకి’ సినిమాను సెప్టెంబర్ 20 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకున్నారు.

Related posts

మల్దకల్ దేవాలయ అభివృద్ధికి సహకరించండి

mamatha

పనులన్నీ త్వరగా పూర్తిచేయాలి 

Murali Krishna

చౌటుప్పల్ రోడ్డు ప్రమాదంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

Satyam NEWS

Leave a Comment