37.2 C
Hyderabad
April 30, 2024 11: 52 AM
Slider సినిమా

తాగి పోలీసుల్ని కొట్టిన హీరోయిన్ అరెస్ట్

#kavyathoper

ఏక్ మినీ కథ హీరోయిన్ కావ్యా థాపర్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆమె మద్యం తాగి కారు నడిపడమే కాకుండా పోలీసులను దుర్భాషలాడారు. ఆమె యాక్సిడెంట్ చేయడంతో ఒకరు గాయపడ్డారు. తర్వాత పోలీసులను బూతులు తిట్టడమే కాకుండా ఓ అధికారి కాలర్ పట్టుకుని ఆమె కొట్టింది. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ముంబై పశ్చిమ శివారు జుహులో కావ్యా థాపర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేసింది. ఆగి ఉన్న ఒక కారును తన కారు తో ఢీకొట్టింది. పోలీసు సిబ్బంది ఆమెను ఆపి ప్రశ్నించగా కావ్యా థాపర్‌ వారిని దుర్భాషలాడింది దాంతో అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.

Related posts

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

Satyam NEWS

లారీ ఢీకొని కారు దగ్ధం: వ్యక్తులు నలుగురు సజీవ దహనం

Satyam NEWS

ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి: విజయనగరం ఎస్పీ దీపిక

Satyam NEWS

Leave a Comment