40.2 C
Hyderabad
April 29, 2024 15: 41 PM
Slider జాతీయం

పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర వార్షిక బడ్జెట్ లో చర్యలు

#nirmala

కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్  ప్రకటించారు. పార్లమెంటులో ఆమె బడ్జెట్ ప్రసంగం చేశారు. పర్యావరణ హిత చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి పెద్దపీట వేస్తున్నట్టు నిర్మల తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్స్ సుంకం తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. అదే సమయంలో టీవీ ప్యానెళ్లపైనా ఉదారంగా వ్యవహరించారు. మొత్తమ్మీద పలు వస్తువులపై కస్టమ్స్ సుంకం తగ్గించారు. అటు, బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం పెంచారు. ఎలక్ట్రిక్ వాహనాలు, టీవీలు, మొబైల్ ఫోన్లు, కిచెన్ చిమ్నీలు, లిథియం అయాన్ బ్యాటరీల ధరలు తగ్గానుండగా, టైర్లు, సిగరెట్లు, బంగారం, వెండి, వజ్రాలు, బ్రాండెడ్ దుస్తులు విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు పెరగనున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 వార్షిక బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయింపులను ప్రకటించారు. బడ్జెట్ లో మూలధన వ్యయం మొత్తం రూ.10 లక్షల కోట్లు అని వెల్లడించారు.

వ్యవసాయ రుణాల కోసం రూ.20 లక్షల కోట్లు

శ్రీ అన్నపథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం

పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లతో ప్రత్యేక పథకం

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యత

గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు

వ్యవసాయ స్టార్టప్ ల ప్రోత్సాహనికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు

వచ్చే మూడేళ్లలో కోటి మంది రైతులను సేంద్రియ సేద్యం వైపు మళ్లింపు

రైతుల కోసం 10 వేల బయో ఇన్ పుట్ రిసోర్స్ కేంద్రాల ఏర్పాటు

దేశంలోని 63 వేల వ్యవసాయ పరపతి సంఘాల డిజిటలైజేషన్

పరపతి సంఘాల డిజిటలైజేషన్ కు రూ.2 వేల కోట్లు

ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం

సికిల్ సెల్ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక తోడ్పాటు

నేషనల్ డిజిటల్ లైబ్రరీ వ్యవస్థకు ప్రోత్సాహం

గిరిజనుల కోసం పీవీటీజీ పథకం ఏర్పాటు

రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు

రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు

రైల్వే శాఖకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు

2013-14తో పోల్చితే రైల్వేలకు 9 రెట్లు అధికంగా నిధులు

కీలకమైన 100 మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు

ఫలితాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపు

ఏకలవ్య పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయుల నియామకం

పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు

5జీ సేవల యాప్ ల అభివృద్ధి కోసం 100 పరిశోధనా సంస్థలు

ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ.7 వేల కోట్లు

ఎంఎస్ఎంఈలు, ఎన్జీవోలు, వ్యాపార సంస్థలకు డిజిలాకర్ సేవల విస్తరణ

కాలం చెల్లిన వాహనాల తొలగింపునకు తక్షణ ప్రాధాన్యత

కేంద్ర ప్రభుత్వ వాహనాలు మార్చేందుకు ప్రత్యేక నిధులు

కొత్త వాహనాల కొనుగోలుకు రాష్ట్రాలకు కూడా సాయం

నీతి ఆయోగ్ మరో మూడేళ్ల పాటు పొడిగింపు

పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు

కేంద్ర వార్షిక బడ్జెట్… హైలెట్స్-2

ముగిసిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం

గంటన్నర పాటు సాగిన బడ్జెట్ ప్రసంగం

వివిధ రంగాలకు కేటాయింపులు

పలు స్కీముల ప్రకటనలు చేసిన నిర్మల,

మహిళల కోసం కొత్తగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్

రెండేళ్ల కాలవ్యవధితో స్కీమ్

ఇది ఫిక్స్ డ్ డిపాజిట్ పథకం

డిపాజిట్ పై 7.5 శాతం సుస్థిర వడ్డీ

గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం

సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో డిపాజిట్ పరిమితి పెంపు

ప్రస్తుతం 15 లక్షలుగా ఉన్న పరిమితిని ఇకపై రూ.30 లక్షలకు పెంపు

కర్ణాటకలో వెనుకబాటుతనం ఎదుర్కొంటున్న ప్రాంతాల సాగు రంగానికి రూ.5,300 కోట్లు

పీఎం కౌశల్ పథకం కింద 4 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ

దేశీయ ఉత్పత్తుల విక్రయం కోసం యూనిటీ మాల్స్ ఏర్పాటు

దేశంలో 50 నూతన విమానాశ్రయాలు, హెలీప్యాడ్ ల ఏర్పాటు

దేశంలో 50 పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి నిధులు

జాతీయ సహకార డేటా బేస్ కు రూ.2,516 కోట్లు

కృత్రిమ మేధ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు

కృత్రిమంగా ల్యాబొరేటరీల్లో వజ్రాల తయారీకి ఐఐటీలకు ప్రత్యేక నిధుల కేటాయింపు

2030 నాటికి 5 ఎంఎంటీ హైడ్రోజన్ తయారీ… జాతీయ హైడ్రోజన్ ప్రాజెక్టుకు రూ.19,700 కోట్లు

లడఖ్ లో రెన్యూవల్ ఎనర్జీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.20,700 కోట్లు కేటాయించారు.

Related posts

కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం

Satyam NEWS

పోలీసుల ఉక్కుపాదం:కేశినేని నాని గృహనిర్బంధం

Satyam NEWS

దళిత రత్న అవార్డు గ్రహీతలకు కామారెడ్డిలో సన్మానం

Satyam NEWS

Leave a Comment