31.2 C
Hyderabad
May 3, 2024 02: 46 AM
Slider వరంగల్

హాకీ పితామహుడు ధ్యాన్ చంద్ ప్రతి క్రీడాకారుడికి ఆదర్శం

#dhyanchand

హాకీ పితామహుడు లెజెండరీ మేజర్ ధ్యాన్ చంద్ ప్రతి క్రీడాకారుడికి ఆదర్శప్రాయుడని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి పి.వి.రమణ చారి అన్నారు. ములుగు సంక్షేమ భవన్ లో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశ కీర్తిని ప్రపంచ నలుదిశలా వ్యాపించేలా ఒలంపిక్స్ క్రీడలలో వరుసగా మూడు బంగారు పతకాలు సాధించారని తెలిపారు. క్రీడా చరిత్రలోనే జీవితకాల క్రీడా పురస్కారం (అవార్డ్) అందుకున్న ఏకైక క్రీడాకారుడు ధ్యాన్ చంద్ అని అన్నారు.

అనంతరం క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చల్లగరుగుల సాంబయ్య, బాక్సింగ్ కోచ్ మామిడి పెల్లి రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు బలుగురి వేణు, రాములు, జగదీష్, మల్లయ్య, లవణిక, జ్యోతి,క్రీడాకారులు తదితరులు ఉన్నారు.

Related posts

36 లక్షల నిధులతో ఉప్పల్ ముదిరాజ్ భవన నిర్మాణానికి భూమి పూజ

Satyam NEWS

సంక్షేమానికి ములస్తంబాలు…వలంటీర్ లకు పురస్కారాలు…

Satyam NEWS

హుజూరాబాద్ పై ఎగ్జిట్ పోల్స్ నిషేధం

Satyam NEWS

Leave a Comment