31.7 C
Hyderabad
May 2, 2024 09: 05 AM
Slider నల్గొండ

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

#Nalgonda Medical and Health

సూర్యాపేట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి Dr. హర్ష వర్ధన్ బుధవారం  హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏరియా వైద్యశాలలో  ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడి covid -19 పరీక్ష కేoద్రాన్ని, శిశు టీకా కార్యక్రమాన్ని, ఆపరేషన్ ధియేటర్ ను పరిశీలించారు.

covid -19 లక్షణాలు కలిగిన వారికి పరీక్షలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. హాస్పిటల్ లో అందుతున్న సేవల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం  హుజుర్ నగర్ లోని  ప్రవేట్ హాస్పిటల్స్ లోని ఫార్మసీ, ల్యాబ్ లను తనిఖీ చేశారు.

ప్రవేట్ హాస్పిటల్, ల్యాబ్ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు  ఆరోపణలువస్తే  లైసెన్స్ లు  రద్దు చేస్తామని హెచ్చరించారు. స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి జన్మదిన సందర్భంగా అంకిరెడ్డి, గోపిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి కోవిడ్ – 19 సాధారణ సేవలు కొరకై అంబులెన్స్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమాన్ని వైద్యశాల సూపరెండెంట్ డాక్టర్ ప్రవీణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  ఏరియా హాస్పిటల్  సూపరెండెంట్  Dr.ప్రవీణ్ కుమార్,  Dr.వనజ,  డిప్యూటీ డెమో.తిరుపతి రెడ్డి, DM & HO. C.C భాస్కర్ రాజు, అంబులెన్స్ బహుకరించిన వారిలో పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, సోమ గాని ప్రదీప్, బెల్లంకొండ అమర్, దొంతగాని బుచ్చిబాబు, జెట్టి రాజేష్, వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.

Related posts

విషాదంలో సినీ పరిశ్రమ

Murali Krishna

మకర విళక్కు కోసం మళ్లీ తెరుచుకోనున్న శబరిమల

Satyam NEWS

హైదరాబాద్ మెట్రో రైల్ పుస్తకానికి జాతీయ అవార్డు

Satyam NEWS

Leave a Comment