సీనియర్ నాయకుడు, మాజీమంత్రి చెరుకు ముత్యం రెడ్డి కన్నుమూశారు. హైద్రాబాద్ లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో గుండె పోటుతో ఆయన మరణించారు. చెరుకు ముత్యంరెడ్డి కి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ ను ఆదేశించారు. చెరుకు ముత్యంరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్యంరెడ్డి ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడం దురదృష్టం అని ముఖ్యమంత్రి అన్నారు. గచ్చిబౌలి లోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాదపడుతు AIG హాస్పిటల్ లో చికిత్స పొందారు ఆయన. ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి మృతి పట్ల శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ నాయకుడు , మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక గొప్ప నాయకున్ని కోల్పోయాం..ఎమ్మెల్యే గా, మంత్రి గా , టిటిడి బోర్డు సభ్యుడిగా , ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఆయన అహర్నిశలు కృషి చేశారు.. టి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన కొద్దిరోజుల్లో వారు అందించిన సేవలు మరువ లేనివి. చివరి దశ వరకు కూడా ప్రజా సేవలో పరితపించారు. ఒక నిబద్ధత నాయకునిగా రాజకీయాల్లో రాణించారు అని హరీష్ అన్నారు.
previous post
next post