28.7 C
Hyderabad
April 27, 2024 03: 01 AM
Slider విజయనగరం

Vijayanagaram Police: 55 మంది హెచ్ సీలకు కోరుకున్న చోటుకే బదిలీ

#vijayanagaram police

విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి..నిష్పక్షపాతంగా పోలీసు సిబ్బంది కి అందులో హెచ్ సీలకు వారు కోరిన విధంగా నే బదిలీలు చేసారు. జిల్లాలో ఏజన్సీ ప్రాంతాల్లో మూడు ఏళ్లకు పైబడి, మైదాన ప్రాంతాల్లో ఐదు ఏళ్ళకు పైబడి

వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న 55మంది హెడ్ కానిస్టేబుళ్ళును ఎస్పీ రాజకుమారి బదిలీలు చేసారు. ముందుగా జాబితా సిద్ధం  చేసుకున్న జిల్లా ఎస్పీ వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుళ్ళుతో జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించి, వారి కోరిక మేరకు, జిల్లాలో ఏర్పడిన ఖాళీలు ఆధారంగా పారదర్శకంగా బదిలీలు నిర్వహించారు.

ఏజన్సీ ప్రాంతంలో మూడేళ్లు, మైదాన ప్రాంతాల్లో ఐదు ఏళ్ళు పూర్తి చేసుకున్న హెచ్సీలకు, ఇటీవల కాలంలో హెడ్ కాని స్టేబుళ్ళుగా ఉద్యోగోన్నతి పొందిన వారికి  జూమ్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కౌన్సిలింగు నిర్వహించారు.

జూమ్ కాన్ఫెరెన్స్ లో జిల్లాలో ఏర్పడిన ఖాళీలను ప్రదర్శించి, ఒక్కొక్కరితో నేరుగా జిల్లా ఎస్పీ మాట్లాడి, వారి సమస్యలను వింటూ, వాటిని పరిష్కరించే దిశగా వారు కోరుకున్న చోటుకు బదిలీ చేసారు. ఎటువంటి సిఫార్సులు లేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా బదిలీలు చేయడంతో పోలీసు సిబ్బందిలో హర్షం వ్యక్తమైంది.

పోలీసుశాఖలో పనిచేస్తున్న హెచ్ సిల సీనియార్టీకి అత్యధిక ప్రాధాన్యతను కల్పించి, వారిని ముందుగా కౌన్సిలింగులో ప్రాధాన్యతను జిల్లా ఎస్పీ కల్పించారు.అనంతరం జిల్లా పోలీసు శాఖలో 55 మంది హెడ్ కానిస్టేబుళ్ళను ప్రస్తుతం పని చేస్తున్న పీఎస్నుం డి వేరే పోలీసు స్టేషనుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

ఈ కౌన్సిలింగు ప్రక్రియలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, ఏఓ శ్రీనివాసరావు, జూనియర్ సహాయకులు రమణ పాల్గొన్నారు.

Related posts

జగన్ నియంతపాలనలో అంగన్వాడీ చెల్లెమ్మల బలి

Satyam NEWS

దళితులను హింసిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం

Satyam NEWS

మల్లెల తీర్థంలో యువకుడి గల్లంతు

Satyam NEWS

Leave a Comment