27.7 C
Hyderabad
April 30, 2024 08: 34 AM
Slider రంగారెడ్డి

నాకు జన్మనిచ్చిన మల్లాపూర్ కు రుణపడి ఉంటా

#bandari

మల్లాపూర్ మరింత అభివృద్ధి చెందాలంటే ఉప్పల్ లో బిఆర్ఎస్ జెండా ఎగరాలి

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని, మల్లాపూర్ డివిజన్ మరింత అభివృద్ధి చెందాలంటే, ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ జెండా ఎగరాలని  ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మల్లాపూర్ డివిజన్, పఠాన్ బస్తిలో అల్తాఫ్,మునీరుద్దిన్  ఆధ్వర్యంలో, మల్లాపూర్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం  జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యతిధిలుగా బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి  బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో కేసీఆర్  దయవల్ల మైనారిటీస్ చాల సంతోషంగా ఉన్నారని హర్షం వ్యక్తం చేస్తూ షాదిముబారక్ లాంటి పథకంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగొచ్చిందని, రాబోవు ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటేసి బండారి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అని తమ పూర్తి మద్దతు ప్రకటించారు. తమ బస్తీలో ఉన్న పలు సమస్యలు బండారి లక్ష్మారెడ్డి  దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి  మాట్లాడుతూ మల్లాపూర్ తాను పుట్టిన ఉరంటూ గుర్తుచేశారు. తన దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలన్నీ తప్పకుండా పరిష్కరిస్తానని హామీనిచ్చారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని మల్లాపూర్ డివిజన్ మరింత అభివృద్ధి చెందాలంటే ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ జెండా ఎగరాలని  అందరూ కారు గుర్తుకు ఓటు వేసి తనని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Related posts

ఒకే గొడుగు కిందకు మొత్తం నీటిపారుదల శాఖ?

Satyam NEWS

శిక్షణలో క్షేత్రస్థాయి సందర్శన అత్యంత కీలకం

Sub Editor 2

మహిళలందరూ కలిసి బీజేపీని అధికారంలోకి తేవాలి

Bhavani

Leave a Comment