ఐఏఎన్ఎస్ – సీ ఓటర్ రిపబ్లిక్ డే ‘స్టేట్ ఆఫ్ నేషన్’ సర్వేలో జనాదరణ గల నేత గా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ముందున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉన్న పాప్యులారిటీ విషయంలో తన తల్లి కన్నా రాహుల్ గాంధీ ముందున్నట్లు సర్వే ప్రతినిధులు వెల్లడించారు.తాజాగా ఐఏఎన్ఎస్ – సీ ఓటర్ రిపబ్లిక్ డే ‘స్టేట్ ఆఫ్ నేషన్’ సర్వేను నిర్వహించగా, సోనియాగాంధీకి 49.5 శాతం మంది, రాహుల్ గాంధీకి 51.9 శాతం మంది మద్దతుగా నిలిచారు.
మొత్తం 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించామని తెలిపిన నిర్వాహకులు 30,240 మంది నుంచి అభిప్రాయాలను తీసుకున్నామని చెప్పారు. ఇక పనితీరు విషయం లో ఒకటి రెండు రాష్ట్రాలు లో మినహా రాహుల్కు జనాదరణ లభించక పోవడం గమనార్హం.హరియాణాలో రాహుల్ పనితీరుపట్ల కేవలం 17.7 శాతం మంది సంతృప్తిగా ఉండగా, కేరళలో 51.9 శాతం, పుదుచ్చేరిలో 76 శాతం రాహుల్ కు అనుకూలంగా ఉన్నారని సర్వే పేర్కొంది.