38.2 C
Hyderabad
May 1, 2024 21: 57 PM
Slider ఖమ్మం

ఐఏఎస్… ఐపీఎస్ లు బీఆర్ఎస్ పార్టీ తొత్తులా

#BRS party

లక్షలాది మంది గుండె చప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో నా అభిమానుల కోరిక మేరకు చేరతావుంటే అది జీర్ణించుకోలేని రాక్షస బీఆర్ఎస్ ప్రభుత్వం రకరకాల కుయుక్తులు పన్నుతూ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం లో ఆయన మాట్లాడుతూ అధికారులు కూడా బీఆర్ఎస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తు వారి అండదండలతో తమకున్నా అధికార మదంతో రకరకాలుగా తన అనుచరులను ఇబ్బందులు పెట్టే కుట్రలు చేస్తూ వస్తున్నారని, .

నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి లాభం చేకూర్చాలనే ఉద్దేశ్యంతో రాహుల్ గాంధీ సభ కోసం జనాలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు కావాలని కోరితే ప్రజాప్రతినిధులకు దాసోహమై బస్సుల కేటాయింపుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ పై నా పై ఉన్న అభిమానంతో తరలిరావాలని స్వచ్ఛందంగా జీవులు, డీసీఎంలు ఇతరత్రా రవాణా సౌకర్యాల ద్వారా రావాలని ఏర్పాట్లు చేసుకుంటూ పోతుంటే పిరికిపందల్లా చెక్ పోస్టుల దగ్గర వాహనాలను ఆపేందుకు ఆదేశాలు ఇచ్చారు.

తన అనుచరుడు మువ్వా విజయబాబు ను చంపుతామని బెదరిస్తు పోస్టర్లు రిలీజ్ చేయడం కాదు… దమ్ముంటే నేరుగా వచ్చి నన్ను నా అనుచరులను ఢీకొనండి…. తనను అణగదొక్కడం చేతకాక నా అనుచరులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి చెబుతున్నా రాసిపెట్టుకోండి వెంట్రుకలు కూడా పీకలేరు. ప్లెక్సీలు చింపించడం, సభకు వెళ్తారనే దురుద్దేశ్యంతో మంచినీటి సరఫరా నిలిపి వేసి వారిని రోజంతా తీవ్ర ఇబ్బందులు గురిచేశారు.

ఐఏఎస్ స్థాయిలో ఉన్న మున్సిపల్ అధికారి పార్టీ తొత్తులాగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం…. మరో పక్క పోస్టర్ రిలీజ్ చేసి తన అనుచరుణ్ణి చంపుతామని బెదిరించినట్లు సాక్ష్యంతో సహా చూపిస్తే ఐపీఎస్ స్థాయిలో ఉన్న జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ఎటువంటి సమగ్ర విచారణ చేపట్టకుండానే అటువంటిదేమి లేదని అధికార పార్టీ వారు రాసిచ్చిన స్క్రిప్టును మీడియా ప్రకటన చేసినట్లు స్పష్టమవుతోందన్నారు .

ఈ ఘటన పై ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఫిర్యాదు తీసుకొనేందుకు వెనుకాడుతూ…. ఎలాంటి ఫిర్యాదు చేయలేదనడం సరికాదని, . కావాలని అధికారులు ఫిర్యాదును తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఇటువంటి ప్రకటన చేయడం హాస్యస్పాదం అన్నారు. కావున ఇకనైనా ఈ అంశం పై సమగ్ర విచారణ జరిపి అట్టి వాల్ పోస్టర్ తయారు చేసి అతికించే ప్రయత్నం చేసిన వారిని గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Related posts

మొక్కలు నాటిన యాంకర్‌ అనుసూయ

Satyam NEWS

పూలే విగ్రహం ఏర్పాటు కోసం 3న హైదరాబాద్ లో దీక్ష

Satyam NEWS

రక్తదానంతో మరో ప్రాణం కాపాడిన డి ఎస్ ఆర్ ట్రస్ట్

Satyam NEWS

Leave a Comment