ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. డిసెంబరు 30 నుంచి జనవరి 7 వరకు తిరుమలలో ఈ నిబంధన అమలులో ఉంటుంది. దాతలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబరు 30 నుంచి జనవరి 1 వరకు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 4 నుంచి 7 వరకు ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపును నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సౌకర్యవంతంగా చేరుకునేందుకు వీలుగా ఉచిత బస్సుల సంఖ్యను టీటీడీ పెంచనుంది.