33.7 C
Hyderabad
April 29, 2024 00: 43 AM
Slider నల్గొండ

ఆర్ఎంపి,పిఎంపి, గ్రామీణ వైద్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ

#rmpdoctor

టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆర్ఎంపి, పిఎంపి లకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్టు అందించాలని రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్ఎంపి, పిఎంపి, గ్రామీణ వైద్యులకు పది లక్షల క్యాష్ లెస్ హెల్త్ కార్డులు అందించాలని వారు కోరారు. అదే విధంగా బస్తీ దవాఖానాల్లో అవకాశం కల్పించాలని వారు కోరారు. ఆర్ఎంపి, పిఎంపి, గ్రామీణ వైద్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత  కల్పించి న్యాయం చేయాలని శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ లో జరిగిన హుజూర్ నగర్ మండల, రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కోరారు.

గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు  షేక్.మన్సూర్ అలీ మాట్లాడుతూ గుర్తింపు కార్డు లేని సంఘ సభ్యులకు సంఘం సభ్యత్వ ఐడి కార్డులను పంపిణీ చేయటం జరిగిందని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలోని యాభై వేల మంది ఆర్ఎంపి, పిఎంపీ,గ్రామీణ వైద్యులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన కమ్యూనిటీ పారా మెడిక్ శిక్షణా తరగతులు ప్రారంభించి పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందచేయాలని కోరారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ కష్ట కాలంలో కూడా ఆర్ఎంపి, పిఎంపీ, గ్రామీణ వైద్యులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రజలకు ప్రాథమిక వైద్య సహాయ సహకారాలు,సూచనలు, సలహాలు అందించారని,అలాంటి పేద ఆర్ఎంపి, పిఎంపీ లకు వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల క్యాష్ లెస్ హెల్త్ కార్డులు అందించి ఆదుకోవాలని,అర్హులైన ఆర్ఎంపి పిఎంపి గ్రామీణ వైద్యులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ప్రాధాన్యత కల్పించాలని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభిస్తున్న బస్తీ దవాఖానాలలో ఆర్ఎంపి,పిఎంపి, గ్రామీణ వైద్యులకు తప్పనిసరిగా అవకాశం కల్పించి వారి సేవలు ఉపయోగించుకోవాలని కోరారు.

ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆర్ఎంపి,పిఎంపీలకు ప్రభుత్వపరంగా చట్టబద్ధత కల్పించి సమాజంలో గౌరవంగా జీవించేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గరి నుంచి కిందిస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సంఘ పరంగా ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటీ,మున్సిపల్ శాఖా మంత్రి కెటిఆర్, మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి,ఈటెల రాజేందర్,ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖా మంత్రి టి.హరీష్ రావు కి  అనేక మార్లు తమ సమస్యలు విన్నవించి తమ ఆవేదనను  తెలిపి న్యాయం చేయాలని వినతి పత్రాలు ఇచ్చి నప్పటికీ నేటి వరకు కూడా ఆర్ఎంపి,పిఎంపి ల వ్యవస్థకు న్యాయం జరగలేదన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించి న్యాయం చేసి ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలో కరోనా  మొదటి,రెండో దశలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన ఆర్ఎంపి పిఎంపి ల ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్యాపేట జిల్లా ఆర్ఎంపి సంఘం గౌరవాధ్యక్షుడు షేక్ బాబు నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ మన్సూర్ అలీ సంఘ సభ్యుల మెడలో నూతన గుర్తింపు కార్డు వేసి, అభినందించారు. ఈ సందర్భంగా షేక్.బాబు   మాట్లాడుతూ సంఘ సభ్యులు ఐకమత్యంతో కలిసి మెలిసి ఉండి సంఘం నియమ నిబంధనలకు లోబడి ప్రాథమిక వైద్యసేవలు అందించాలని,  ఐడీ కార్డ్స్ ను దుర్వినియోగం చేయవద్దని అన్నారు.  

ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మండలం ఆర్ఎంపి సంఘం ప్రధాన కార్యదర్శి సన్నిధి వెంకటేశ్వర్లు,  సహాయ కార్యదర్శి షేక్.మీరా, మొయినొద్దీన్,కమిటీ సభ్యులు కె.పూల రాజు,శ్రీనివాసు,బి.సీతారామరాజు, ఎండి.అబ్దుల్ సమద్, కడియాల రమేష్, సిహెచ్.రాజశేఖర్ ఆర్.అంజీ, నగేశ్, వి.శ్రీనివాస్,షేక్.సైదా, ఎండి నజీరుద్దీన్, జి.వెంకటేశ్, షేక్.సాదిక్  తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

వాళ్ళిద్దరు కలిశారంటే జగన్ పార్టీ పని అవుట్

Satyam NEWS

డ్రగ్స్ వాడకంపై కఠినంగా వ్యవహరించండి

Satyam NEWS

ఎదురుదాడికి ప్రత్యేక వ్యూహం

Murali Krishna

Leave a Comment