33.7 C
Hyderabad
April 30, 2024 02: 20 AM
Slider మహబూబ్ నగర్

అగ్రిగోల్డ్ లే-అవుట్ సంస్థకు నోటీసులు

#nandalalpowerias

వనపర్తి పట్టణ శివారులో నిబంధనలకు విరుద్దంగా  లే-అవుట్ వేసి ప్లాట్లు విక్రయించిన  అగ్రిగోల్డ్ సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేయాలని  కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. 7 రోజుల్లో  వివరణ ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వనపర్తి లో ఏర్పాటు చేసిన అన్ని లే-అవుట్ లను పరిశీలించాలని గ్రామ పంచాయతీ లేఅవుట్ అయిన లేదా మున్సిపల్ లేఅవుట్ అయిన నిబంధనల మేరకు   వెంచర్ లో  10 శాతం ల్యాండ్ రిజిస్ట్రేషన్ గ్రామ పంచాయితీ లేదా మున్సిపాలిటీ పేరున   చేసారా లేదా పరిశీలించాలని లేని పక్షంలో  చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్ లో  ఉన్న ఆస్తి పన్ను, వాణిజ్య, నివాస వసూళ్లను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ తో కలిసి వనపర్తి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో ఇప్పటివరకు కేవలం 27 శాతం మాత్రమే  పన్ను వసూళ్లు  జరిగాయని మార్చి గడువు లోగా వంద శాతం పన్ను వసూలు కు  బృందాలను ఏర్పాటు చేసి వేగంగా పన్ను వసూళ్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. కమర్షియల్ ప్రాపర్టీ లకు సంబంధించి బిల్లులు వసూలు చేయడానికి మూడు ప్రత్యేక బృందాలను  ఏర్పాటు చేయాలన్నారు.

100 కమర్షియల్ ప్రాపర్టీ లను గుర్తించి వాటిని పునఃపరిశీలన చేయాలని  ప్రతి ప్రాపర్టీ కి సంబంధించి పరిశీలిస్తున్న ఫోటోలు, వీడియోలు  గ్రూపులో పెట్టాలని వాటికి సంబంధించిన నివేదికను ఇవ్వాల్సిందిగా  ఆదేశించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఇందుకు మున్సిపల్ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి తాగు నీటి సమస్య ఏమైనా ఉందా అని తెలుసుకొని వాటిని పరిష్కరించటంతో  పాటు అట్టి నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. తాగునీటి సరఫరా పై   తాను, అదనపు కలెక్టర్  నివాస ప్రాంతాల్లో అక్కడక్కడ   పర్యటించి పరిశీలిస్తామని సమస్యలు ఉన్నట్లు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీటి సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కారం చేయాలనీ తెలిపారు.

స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా అధికారులు వార్డుల్లో తిరిగి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. రోడ్ విస్తరణ పనులు  కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు పునఃప్రారంభం అయ్యేవిథంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో  మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి, ఏఈలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

టుడే స్పెషల్: మురుగు నీరే ఇక్కడి బిర్యానీ సెంటర్ల ప్రత్యేకత

Satyam NEWS

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి స్టడీ మెటీరియల్

Satyam NEWS

ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపుతోనే హుజూర్ నగర్ అభివృద్ధి

Satyam NEWS

Leave a Comment