40.2 C
Hyderabad
April 29, 2024 18: 13 PM
Slider ప్రత్యేకం

నెల్లిమర్ల డైట్ కాలేజ్ సమీపంలో అక్రమంగా ప్రార్ధనాలయం…!

#nellimarla

విజయనగరం  జిల్లా లోని నెల్లిమర్ల డైట్ కాలేజ్ సమీపంలో అక్రమ చర్చ్ నిర్వహణ స్థానికులను ఇబ్బందికి గురి చేస్తున్నపాస్టర్, చర్చ్ పై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ ధార్మిక సంస్థ ఫిర్యాదు చేసింది. డైట్ కాలేజ్ దగ్గర పాస్టర్ మోహిత్ దీపు”పెనూయేలు ప్రార్ధ నా మందిరం” పేరుతో ఎటువంటి ప్రభుత్వ అనుమతులూ లేకుండా ఒక  అక్రమ చర్చ్ నిర్వహిస్తున్నాడు. ఈ చర్చ్ నిర్వహణలో సదరు పాస్టర్ ఈ క్రింది చట్టాలను ఉల్లంఘించి,నేరాలకు పాల్పడుతున్నాడు.

(1) NOISE POLLUTION (REGULATION AND CONTROL) నిబంధనలు-2000, SECTION 5 (1),(2),(5),(6)ల ప్రకారం DSP లేదా కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతుల ను పొందాలి.కానీ సదరు పాస్టర్ అలాంటిదేమీ పొందియుండలేదు.

(2) పెద్ద శబ్దం ద్వారా ప్రజలను వేధించడం నేరం అని భారత శిక్షాస్మృతి(IPC)లోని 268 సెక్షన్ చెబుతుంది.ఈ ప్రకారం సదరు చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు.

(3) మత ప్రచారం పేరుతో, ఇతరుల మత విశ్వాసాలను  కించపరచడం,కించపరిచే ప్రయత్నం గా మైకులో ప్రార్థనలు కూడా.. భారతీయ శిక్షాస్మృతిలోని.. సెక్షన్ 295 (ఎ) చట్టాన్ని అతిక్రమించడమే.సదరు చట్టవ్యతి రేకంగా వ్యవహరిస్తున్నారు.

(4) ఐపిసి సెక్షన్ 153 (ఎ) ప్రకారం, దేవాలయాల లోకి వినిపించేలా మైకులో వైషమ్యాలు రెచ్చగొ డుతూ,ప్రశాంత సామరస్య వాతావరణాన్ని చెడగొట్టేలా ప్రార్థనలు చేయటం, పై విధముగా ఉపన్యాసాలు చెబుతూ తమ మత ప్రచారం చేసుకోవటం,పోస్టర్లు,బ్యానర్ల ప్రదర్శించడం తో ఈ నేరానికి పాల్పడుతున్నారు.

(5) G.O.MS.NO.172, dt 12-10-2010 .. ప్రకారం పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి లౌడ్ స్పీకర్ వాడిన యెడల అపరాదులకు చట్ట ఉల్లంఘనకు 4000/- జరిమానా విధించవలెను అన్న విషయాన్ని మీ దృష్టికి వినయపూర్వకంగా తీసుకు వస్తున్నాము

(6) G.O.M.S.No. 376 dt. 29-11-12 పంచా యతీరాజ్ వారి ఆర్డర్ ప్రకారం మతపర కట్టడా లకు జిల్లా కలెక్టర్ వారి ముందస్తు అనుమతి తప్పనిసరి,ఈ చర్చ్ కి ఈ అనుమతీ లేదు.

(7) Hon’ble Supreme Court’s Judgeme nt vide SLP: 8519/2006 ప్రకారం ఇది నేరం..

(8) హిందూ దేవాలయ చట్టం-1987,సెక్షన్ 30 ప్రకారం హిందూ దేవాలయాల చుట్టూ మరియు హిందూ నివాస గృహాల మధ్యలో రోడ్లపై/మైక్ సెట్ ద్వారా పోస్టర్లు,బ్యానర్లు,ప్రార్థనలు వంటి అన్య మతప్రచారం నిషేధించబడింది.దీనిని ఉల్లంగిం చినవారు ఐ. పి.సి.746 మరియు 747 సెక్షన్ల క్రింద అరెస్టు చేయబడి,బెయిల్ కూడా దొరకని శిక్షకు పాత్రులు అవుతారు.

(9) స్థానిక ప్రభుత్వ లెక్కల ప్రకారం మా ప్రాంతం లో అధికారికంగా క్రైస్తవులు ఒక్కరు కూడా లేరు.

(10) పై చర్చ్ నిర్మాణానికి/నిర్వహణకు చుట్టు పక్కల నివాసమున్నవారి అభిప్రాయాలను, అనుమతిని, పొంది ఉండలేదు కనుక ఈ చర్చిని తొలగించవలసినది.

(11) పై చర్చ్ నిర్వహణకు  మతంమారి క్రైస్తవు లుగా నిరూపించబడిన వారు,50 మంది సభ్యులుగా ఉండాలి.అటువంటి అర్హత లేదు కనుక ఈ చర్చిని తొలగించవలసినది.

(12) పై చర్చ్ లో మైకు నిర్వహణకు DSP వారి అనుమతి పొంది ఉండాలి. అలా పొందకుండా మైకు నిర్వహించిన ప్రతిసారి 2000/ రూపాయలు జరిమానా విధించాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది. కనుక అతనికి ఈ తీర్పును అమలు చేయవలసిందిగా కోరుచున్నాము.

(13) UNION OF INDIA Petitioner(s) VERSUS STATE OF GUJARAT & ORS.  Respondent(s) Special Leave to Appeal (Civil) No(s).8519/2006.  Date: 29/09/2009  JUSTICE DALVEER BHANDARI DR.JUSTICE MUKUNDA KAM SHARMA JJ …..Case లో సుప్రీంకోర్టు

మధ్యంతర ఉత్తరవుల ప్రకారం ఇక మీదట  ( 29/09/2009) దేవాలయము,చర్చ్,మసీదు, లేక గురుద్వారా పేరుతో ఎలాంటి అనధికార, అనుమతులు లేని కట్టడాలు వీధులలో,పబ్లిక్ పార్క్ లో  లేక ఇతర పబ్లిక్ స్థలములలో నిర్మించరాదు.అట్టి కట్టడాలకు అనుమతులు ఇవ్వరాదు.

(14) ఈ చర్చ్ నిర్మాణానికి స్థానిక గ్రామ పంచాయతీ తీర్మానం లేదు.

(15) ఈ చర్చ్ కి సర్వేయర్ ప్లాన్ అప్రూవల్ లేదు.

క్రైస్తవులే లేనటువంటి మా ప్రాంతంలో మా హిందూ నివాసాల మధ్యన,మా  దేవీ దేవత లను దూషిస్తూ,హిందూ గ్రంథాలకు వక్ర భాష్యం చెబుతూ,మా ప్రాంతంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు సదరు చర్చ్ వారు.అంతేకాకుండా ఈ దేశ పౌరుల ప్రాథమిక హక్కు అయిన మా “”స్వేచ్ఛగా జీవించే హక్కు ను”” హరిస్తున్నారు.అంతేకాకుండా ప్రజల “”ప్రశాంత జీవనానికి”” భంగం కలిగిస్తున్నారు . కాబట్టి మిమ్ములను  మేము అభ్యర్థించేది ఏమనగా,పైన తెలియపరిచిన ప్రదేశంలో మా నివాస గృహాలమధ్యలో  సదరు చర్చ్ ని సమూలంగా తొలగించవలసినదిగా కోరుతోంది హైందవ శక్తి.అదేవిధంగా  చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడుతున్నందుకు సంబంధిత పాస్టర్ పై  చట్టపరమైన చర్యలు తీసుకొన వలసినది కోరుతోంది… హైందవ శక్తి.

Related posts

కలకలం రేపుతున్న కాపు కుల సంఘాల సమావేశాలు

Satyam NEWS

రిసార్ట్స్ లో డేంజర్ గేమ్స్: యువకుడి మృతి

Satyam NEWS

కాకినాడ కలెక్టరేట్ వద్ద మాజీ సైనికుడు ఆమరణ నిరాహార దీక్ష

Satyam NEWS

Leave a Comment