30.7 C
Hyderabad
April 29, 2024 06: 55 AM
Slider మహబూబ్ నగర్

తండాల్లో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసు దాడులు

#illicit distilled liquor den

కొల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు నేడు పెద్ద ఎత్తున అక్రమ సారా స్థావరాలను ధ్వంసం చేశారు. కొల్లాపూర్ పరిధిలోని చంద్రబండ తండాలో 10 లీటర్ల నాటు సారా, 150 కిలోల బెల్లం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అక్కడే ఉన్న ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కొల్లాపూర్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు తెలిపారు. అదే విధంగా 200 లీటర్ల ఎఫ్ జె వాష్ ను ధ్వంసం చేసి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.

ముక్కిడిగుండం గ్రామం వైపున ఉన్న నార్లాపూర్ తండా లో ఒక బొలేరో వాహనంలో 65 బస్తాల బెల్లం పొడిని కొల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు కనుగొన్నారు.

ఇది మొత్తం 1950 కిలోల వరకూ ఉంటుందని కొల్లాపూర్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు తెలిపారు.

అదే విధంగా 5 కిలోల నవాసారం ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు.

Related posts

లాభసాటి వ్యాపారాలను ఎంచుకోని జీవితంలో రాణించాలి

Satyam NEWS

పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు అరికట్టలేరా

Satyam NEWS

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment